అమీర్ ఖాన్ కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. (ఫోటో ఫీచర్)
ముంబై: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన కొడుకు ఆజాద్ రావు ఖాన్ తొలి పుట్టిన రోజు వేడుకను ముంబైలోని తన పాలి హిల్ రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ బర్త్ డే వేడుకకు అమీర్ ఖాన్ మొదటి భార్య, పిల్లలు కూడా హాజరయ్యారు.

తన కిరణ్ రావు, కొడుకు ఆజాద్ రావ్ ఖాన్ లతో అమీర్ ఖాన్

ముద్దులొలుకుతున్న ఆజాద్ రావ్ ఖాన్

మీడియా వారు చూట్టూ చేరి ఫోటోలు తీస్తుండటంతో ఇబ్బంది పడుతున్న ఆజాద్ రావ్ ఖాన్

బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథులతో పాటు అమీర్ మొదటి భార్య రీమా

బర్త్ డే పార్టీకి హాజరైన అమీర్ ఖాన్ మొదటి భార్య కొడుకు జునైద్.
గత సంవత్సరం డిసెంబర్ 1న అమీర్ ఖాన్-కిరణ్ రావు తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. వీరిద్దరు IVF పద్దతి లో surrogate mother (ఇతరుల కొరకు తాను బిడ్డను కను స్త్రీ) ద్వారా బిడ్డను కన్నారు. అమీర్ ఖాన్ వీర్య కణాలు, కిరణ్ రావు స్త్రీ అండంతో టెస్టుట్యూబ్ ద్వారా పిండాన్ని సృష్టించి...ఆ పిండాన్ని వేరొక మహిళ గర్భంలో ప్రవేశ పెట్టి బిడ్డను జన్మింప చేస్తారు. అదన్నమాట మ్యాటర్. ఈ విషయమై అమీర్ ఖాన్ అప్పట్లో స్టేట్ మెంట్ విడుదల చేశారు. తన భార్య కిరణ్ రావు గర్భం దరించడానికి ఆరోగ్య పరిస్థితులు సహకరించక పోవడం వల్ల ఈ పద్దతిలో బిడ్డను కనాల్సి వచ్చిందని అమీర్ ఖాన్ అందులో పేర్కొన్నారు.
కిరణ్ రావ్‍ని మతాంతర వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ తన కొడుకుకి వెరైటీగా ఆజాద్ రావ్ ఖాన్ అని పేరు పెట్టాడు. ఈ పేరులోని అర్థాన్ని గతంలో అమీర్ వెల్లడిస్తూ...ఆజాద్ అంటే స్వాతంత్రం. ఇది మా గ్రేట్ గ్రాండ్ అంకుల్ మౌలానా ఆజాద్ పేరు. ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. మేమంతా ఆయన కుటుంబ సభ్యలవ్వడం ఇప్పటికీ గర్వంగా పీలవుతున్నాం.... మా వాడికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ పేరు ఎంపిక చేసింది నా ముద్దుల పెళ్లామే' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











