twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి మూవీ రీమేక్ వార్తలపై అమీర్ ఖాన్ స్పందన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి హీరోగా ప్రముఖ దర్శకుడు బాలచందర్ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ 'రుద్రవీణ'. 1988లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రుద్రవీణ చిత్రం హిందీలో రీమేక్ అవుతోందని, ఇందులో అమీర్ ఖాన్ నటించబోతున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల అమీర్ బాలచందర్‌ను అమీర్ ఖాన్ కలవడంతో ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

    అయితే వార్తల్లో నిజం లేదని అంటున్నారు అమీర్ ఖాన్. ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ...'రుద్రవీణ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనే ప్లాన్స్ ఏమీ లేవు, ఈ రూమర్లు ఎలా ప్రచారంలోకి వచ్చాయో అర్థం కావడం లేదు' అని అన్నారు. బాలచందర్ గ్రేట్ డైరెక్టర్, ఆయన స్పీచ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని అన్నారు అమీర్. తను నటించిన 'ధూమ్-3' చిత్రం ఈ నెల 20 విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా అమీర్ ఖాన్ ఇటీవల చెన్నై వచ్చిన సందర్భంగా బాలచందర్‌ను కలిసారు.

    ఇక ధూమ్-3 సినిమా వివరాల్లోకి వెళితే....

    ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ 'ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

    అమీర్ ఖాన్, కత్రినా కైఫ్‌లపై చిత్రీకరించిన ఓ పాటకు ఏకంగా రూ. 5 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఓ పాటకు ఇంత ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. కత్రినా, అమీర్‌లపై చిత్రీకరించిన ఈ పాటలో 200 మంది జిమ్నాస్టిక్ కళాకారులను అమెరికా నుంచి తీసుకొచ్చారట. కళ్లు చెదిరేలా వేసిన సెట్లో 20 రోజుల పాటు ఈ పాట చిత్రీకరించారని, సినిమాకు ఈ పాట హైలెట్ అవుతుందని అంటున్నారు.

    ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధూమ్-3' చిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. పైగా అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఈచిత్రంలో నటిస్తుండటం కూడా మరో కారణం. భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధం అవుతోంది.

    English summary
    "I've no plans to remake Rudraveena in Hindi. I don't know how these rumours began," Rudraveena said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X