»   »  అమీర్ ఖాన్ ఏడ్చాడంటే....అందులో విషయం ఉన్నట్టేగా?

అమీర్ ఖాన్ ఏడ్చాడంటే....అందులో విషయం ఉన్నట్టేగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఇటీవల ఓ సినిమా చూసిన అనంతరం కంటతడి పెట్టడం చర్చనీయాంశం అయింది. కొంచెం బాధాకరమైన సన్నివేశాలు చూస్తే అమీర్ కంట కన్నీరు కారుతూనే ఉంటుందట. గతంలో మార్గరెట్ కాల్ అనే సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న అమీర్, తాజాగా కపూర్ అండ్ సన్స్ సినిమా చూసి మరింత ఎమోషనల్ అయ్యారు.

కన్నీటిని తూడ్చుకుంటూనే మీడియా ముందుకు వచ్చిన ఆయన నాకు ఎమోషన్ ఎక్కువ, మంచి సినిమా చూస్తే కన్నీళ్ళు ఆపుకోలేనంటూ తెలిపారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ బేనర్‌పై షకున్ బత్రా దర్శకత్వంలో కపూర్ అండ్ సన్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

Aamir Khan cries once again

ఈ చిత్రంలో రిషి కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రా, అలియా భట్, ఫవాద్ ఖాన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు. మానవ సంబంధాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, సినిమా రిలీజ్‌కు ముందు సెలబ్రిటీల కోసం ఓ ప్రివ్యూ షో వేసారు. అమీర్ కూడా ఈ షోకు హాజరు కాగా, ఈ చిత్రం ఆయనను ఎంతగానో కదిలించింది. ఇందులో రిషి కపూర్ పండు ముసలి పాత్రలో కనిపించారు. ఆ పాత్రకు మంచి ఆదరణ లభిస్తుండగా, ఆయన మేకప్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ నుండి స్పెషలిస్ట్‌ని పిలిపించారు కరణ్ జోహార్.

అమీర్ ఖాన్ సైతం ఏడ్చారంటే సినిమాలో విషయం ఉందని, ఇది మంచి సినిమాయే అని ఓ అవగాహనకు వస్తున్నారు ఫ్యాన్స్. అమీర్ ఖాన్ కన్నీరు పెట్టిన ఘట్టం సినిమాకు పబ్లిసిటీ పరంగా బాగా కలిసొచ్చిందని, తప్పకుండా మంచి వసూళ్లు సాధిస్తుందని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

English summary
Aamir Khan cries again after watching Kapoor & Sons. After the film's screening Aamir Khan's quoted "I always cry while watching films", so Kapoor & Sons being an emotional family affair, we weren't surprised to Aamir's reaction
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu