గగ్రాచోళీ డ్రెస్‌లో, కొడుకుతో అమీర్ ఖాన్ (ఫోటోలు)
ముంబై: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన కొడుకు ఆజాద్ రావ్ ఖాన్‌ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు. ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న హిందీ మూవీ 'పికే' సినిమా షూటింగులో ఆజాద్ రావ్ ఖాన్ దర్శనం ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఈ సినిమా సెట్లో ఆజాద్ రావ్ ఖాన్ బుడిబుడి నడకలు వేయడం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ రాజస్థాన్లో జరుగుతోంది. ఈ షూటింగుకు అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్, కొడుకు ఆజాద్ రావ్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఈ మధ్య ఎక్కడ షూటింగ్ జరిగినా వీరిద్దరు అమీర్ వెంటే ఉంటున్నారు. ప్రస్తుతం ఆజాద్ రావ్ ఖాన్ వయసు ఒక సంవత్సరం మాత్రమే. ఇటీవల అమెరికాలో ధూమ్-3 సినిమా షూటింగ్ జరిగినప్పుడు కూడా అమీర్ ఖాన్ తో పాటు ఈ ఇద్దరు అక్కడికి వెళ్లారు.
'పీకే' సినిమా విషయానికొస్త.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. 2014లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అమీర్ ఖాన్ తనయుడు ఆజాద్ రావ్ ఖాన్

పీకే సినిమాలో గగ్రా చోళీ అవతారంలో అమీర్ ఖాన్

పీకే సెట్స్ లో అమీర్ ఖాన్ తదితరులు

కొడుకు ఆజాద్ తో అమీర్ ఖాన్

పీకే సినిమా షూటింగులో అమీర్

పీకే సినిమా సెట్స్ లో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ

ఆజాద్ రావ్ ఖాన్ తో చికాగో వెలుతున్నప్పటి దృశ్యం

ఆజాద్ రావ్ ఖాన్


Click it and Unblock the Notifications











