»   » అమీర్ ఖాన్ దేశ బ్రాండ్ నేమ్ చెడగొట్టడం వల్లే తొలగించాం..

అమీర్ ఖాన్ దేశ బ్రాండ్ నేమ్ చెడగొట్టడం వల్లే తొలగించాం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ భారత్ బ్రాండ్‌కు నష్టం కలిగించారని, అందు వల్లే ఆయన్ను ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగటించినట్లు ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ అన్నారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ఆయన ఆ బ్రాండ్‌ను పెంచేలా కృషి చేయాలి తప్ప నష్టం కలిగించరాదు, ఆయన్ను తొలగించడం సరైన చర్యే అన్నారు.

'ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' బ్రాండ్‌ అంబాసిడర్‌గా సుమారు పదేళ్ళపాటు అమీర్‌ఖాన్‌ పనిచేశాడు. అయితే దేశంలో మత అసహనం పెరిగిపోతోందనీ, ఈ దేశంలో తనకు భద్రత లేదని తన భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ వేరే దేశం వెళ్ళిపోదామని కోరిందంటూ అమీర్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ పరిణామాల ఫలితమే అమీర్ ఖాన్ ను తొలగించేలా చేసాయి.

 Aamir Khan damaged India's brand identity

మొదట ఆయన తొలగింపుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' అనే అంశానికి సంబంధించి ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామనీ, ఆ ఏజెన్సీ అమీర్‌తో కాంట్రాక్ట్‌ విషయమై నిర్ణయం తీసుకుని వుండొచ్చని వాదించారు. ఇప్పుడు అధికారికంగా అమీర్‌ఖాన్‌ తొలగింపుపై ఓ అధికారి స్పష్టతనివ్వడం చర్చనీయాంశం అయింది.

అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాము దేశం విడిచి వెళ్ళడంలేదని అమీర్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇండియా ఎప్పుడూ ఇన్‌క్రెడిబులేనంటూ తన తొలగింపు అనంతరం కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

English summary
defending Aamir Khan's exit as the brand ambassador of the Incredible India Bollywood actor Aamir Khan's exit as the brand ambassador of the Incredible India campaign was on Monday defended by department of industrial policy and promotion (DIPP) secretary Amitabh Kant.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu