ఆ సినిమా విడుదలకు ముందే రీమేక్ కోసం టాప్ స్టార్ వెయిటింగ్...!?
విలక్షణ నటనకు, కళాభిమానానికి, అభిరుచి గల నిర్మాతకు నిలువెత్తు రూపం అమీర్ ఖాన్. ఎన్ని సినిమాలు చేసామనేది కాదు, ఎలాంటి సినిమాలు చేసాం, మంచి సినిమాలు ఎన్ని తీసాం అనేదానికి ప్రాధాన్యత నిస్తూ ఉత్తమ చిత్రాలు తీసి బాలీవుడ్ లో తనదైన ప్రత్యేక స్థానం పొందారు అమీర్. పేరులోనే కాదు చిత్రాల ఎంపికలో కూడా ఆయన అమీరే.. ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, గజని, త్రి ఇడియట్స్ సినిమాలు ఘనవిజయం సాధించి నటునిగా అమీర్ ఖాన్ లోని డిఫరెంట్ కోణాన్ని తెలియజేసాయి. గజిని చిత్రం కోసం ఏడాదిపాటు కష్టపడి కసరత్తులు చేసి కండలు పెంచిన అమీర్ ఖాన్, తర్వాతి చిత్రం త్రి ఇడియట్స్ కోసం కండలు తగ్గించి ఒక సగటు విద్యార్థిగా కనువిందు చేశాడు.
కాగా సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన 'గజిని" తెలుగు, తమిళంలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన విషయమే. హిందీలో అమీర్ ఖాన్ చేసిన 'గజిని" కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న 'సెవెన్త్ సెన్స్" మీద అమీర్ ఖాన్ కన్ను పడింది. ఈ సినిమా రిలీజ్ అవకముందే రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మురుగదాస్ మీద తనకు అపారమైన నమ్మకం వుందని, సెవెన్త్ సెన్స్ హిందీలో తానే చెయ్యాలనుకుంటున్నట్టు చెప్తున్నాడు అమీర్.. కేవలం లాభాపేక్ష కోసం సినిమాలు తీయకుండా కొత్తదనం కోసం తాపత్రయపడటమే అమీర్ ఖాన్ సక్సెస్ సూత్రం. ఈ సక్సెస్ సూత్రం మన దేశానికి మరో ఆస్కార్ తేవడం కోసం అతను ముందుకెళ్ళాలని ఆశిద్దాం..


Click it and Unblock the Notifications











