పవన్ కళ్యాణ్ సమస్యలాంటిదే అమీర్ ఖాన్ కు కూడా..?
పవన్ కళ్యాణ్..తాజా చిత్రం కొమురం పులిలో కొమురం అనే పదం తొలిగించాలంటూ ఎలా వివాదం చెలరేగిందే అలాంటిదే అమీర్ ఖాన్ లేటెస్ట్ చిత్రంకు జరుగుతోంది. ధోభీఘాట్ టైటిల్ తో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం టైటిల్ నుంచి ధోభి అనే పదాన్ని తొలిగించమంటూ కోర్టులో కేసు నమోదైంది. హిందుస్తాన్ కనోజ ఆర్గనైజేషన్ ఆఫ్ ధోబీస్ ఛైర్మన్ వినోద్ కుమార్ కనోజ్ తమ ధోభి కమ్యునిటీని అవమానపరిచేదిలా ఉందంటూ డిల్లీ హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేసారు. ఆ పిటీషన్ లో రాజ్యాంగం ప్రకారం కులం పేరుతో పిలవటం ఫనెషబుల్ అఫెన్స్ గా చెప్పారని, ఈ చిత్రం టైటిల్ తమ ప్రాధమిక హక్కులను భగం కలిగిస్తోందని, కోర్టు దీనిపై న్యాయం చేయాల్సిందని కోరారు. ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్..ఓ కీలకమైన పాత్రను పోషిస్తూ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిచబడి..పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











