»   » చంకలో బుడ్డోడితో సూపర్ స్టార్...(ఫోటో)

చంకలో బుడ్డోడితో సూపర్ స్టార్...(ఫోటో)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, స్టార్ హీరో అమీర్ ఖాన్ ఓ విషయం ఈ మధ్య కామన్‌గా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ తమ ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కంటే తమ పిల్లలకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ఇటీవల ఎక్కడికి వెళ్లినా చంకలో బిడ్డనేసుకుని వెలుతున్న సంగతి తెలిసిందే. అమీర్ చంకలో తన కొడుకు ఆజాద్ రావ్ ఖాన్‌తో ఇటీవల ముంబైలో దర్శనమిచ్చాడు.

  Aamir Khan with son

  అమీర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావుల సంతానమే ఆజాద్ రావ్ ఖాన్. కిరణ్ రావుకు గతంలో గర్భ స్రావం కావడంతో వైద్యుల సలహా మేరకు అద్దెగర్భం(వేరొక మహిళ గర్భంలో వీరి బిడ్డను పెంచడం) ద్వారా డిసెంబర్ 1, 2011న వారసున్ని కన్నారు ఈ స్టార్ కపుల్. తమ ముద్దుల తనయుడికి'ఆజాద్ రావు ఖాన్' అని పేరు పెట్టారు.

  కిరణ్ రావ్‍‌ని కులాంతర వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ తన కొడుకుకి వెరైటీగా ఆజాద్ రావ్ ఖాన్ అని పేరు పెట్టాడు. ఈ పేరులోని అర్థాన్ని గతంలో అమీర్ వెల్లడిస్తూ...ఆజాద్ అంటే స్వాతంత్రం. ఇది మా గ్రేట్ గ్రాండ్ అంకుల్ మౌలానా ఆజాద్ పేరు. ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. మేమంతా ఆయన కుటుంబ సభ్యలవ్వడం ఇప్పటికీ గర్వంగా పీలవుతున్నాం.... మా వాడికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ పేరు ఎంపిక చేసింది నా ముద్దుల పెళ్లామే' అని చెప్పుకొచ్చారు.

  ఇక అమీర్ నటిస్తున్న ధూమ్ 3 వివరాల్లోకి వస్తే...ఈ చిత్రానికి విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా ముఖ్య తారాగణం. ప్రీతమ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్లో ఈచిత్రం విడుదలవుతోంది.

  English summary
  The one thing that's common between Aamir Khan and Aishwarya Rai Bachchan is that both prioritise their respective kids more than their professional committments. And like the hands-on mommy Ash, Aamir too has recently turned a babysitter for his son Azad Rao Khan. The Mr Perfectionist dad was recently spotted with the little Azad at Mumbai.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more