ప్రజలకు ఆసక్తి లేదు: అమీర్ ఖాన్ ఏడ్చారు

By Bojja Kumar

ముంబై: తను చేసిన పాపుల్ టీవీ షో 'సత్యమేవ జయతే' తర్వాత తన సినిమాలకు ప్రజల్లో ఆసక్తి తగ్గిపోయిందని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు. 'సత్యమేవ జయతే' తర్వాత ప్రజలు నన్ను యాక్టర్ గా చూడటం లేదు(నవ్వుతూ), నన్నొక బాధ్యత కలిగిన వ్యక్తిగా' చూస్తున్నారు అని రిపోర్టతో అన్నారు.

తాజాగా అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే-3' ప్రారంభించారు. మూడోభాగం చిత్రీకరణ కోసం ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అందుకు సంబంధించిన అనుభవాలను గుర్తు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. సమాజంలో మార్పు తేవడమే లక్ష్యంగా వివిధ సామాజిక అంశాలతో ఈ షో సాగుతుంది. సెప్టెంబర్ 21వ తేదీ నుండి స్టార్ ప్లస్ టెలివిజన్ లో 'సత్యమేవ జయతే' మూడో సీజన్ ప్రసారం కానుంది.

Aamir khan gets emotional at the launch of 'Satyamev Jayate-3'

'సత్యమేవ జయతే తర్వాత నా సినిమాల పట్ల అందరిలో ఆసక్తి తగ్గి పోయింది. రాజస్థాన్‌లో 'పికె' షూటింగ్ లో ఉన్నపుడు రిపోర్టర్లు సినిమా గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. వాళ్లంతా 'సత్యమేవ జయతే' కార్యక్రమంపై ఆసక్తి చూపడం గమనించాను' అని అమీర్ ఖాన్ వ్యాఖ్యానించారు.

త్వరలో విడుదల కాబోతున్న తన తాజా చిత్రం 'పికె' సినిమా గురించి మాట్లాడుతూ....'25 ఏళ్లుగా ప్రేక్షకులు నా సినిమాలు చూస్తున్నారు. వారిపై నాకు నమ్మకం ఉంది. పికె పెస్టర్ మీద కేసు వేసిన ఆ ఇద్దరి గురించి పట్టించుకోవడం లేదు. సినిమాపై అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. పికె సినిమా చూసిన తర్వాత అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయి' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X