దయనీయ స్థితిలో శృతిహాసన్ తల్లి.. సారికకు అమీర్‌ఖాన్ అండ

By Rajababu

కమల్ హాసన్ మాజీ భార్య, నటి శృతిహాసన్ తల్లి సారిక పరిస్థితి దయనీయంగా మారిందనే వార్తలు మీడియాలో కథనాలుగా వస్తున్నాయి. సొంత గూడు లేక సారిక అనాథగా మారిందనే వార్తలు కొంత ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సారికకు అండగా నిలిచేందుకు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ రంగంలోకి దిగినట్టు రెండు మూడు రోజులగా వార్తలు మీడియాలో కనిపిస్తున్నాయి.

Recommended Video

గతి లేని స్థితిలో టాప్ హీరో భార్య !
తల్లితో కలిసి సారిక

తల్లితో కలిసి సారిక

కమల్ హాసన్‌తో వేరుపడిన తర్వాత సారికి తన తల్లి కలిసి ముంబైలోని జుహులో ఉన్న భాను అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఈ అపార్ట్‌మెంట్‌లోనే వివేక్ ఒబెరాయ్, గోవిందా లాంటి హీరోలు ఇరుగుపొరుగుగా ఉంటున్నారు.

తల్లి రాసిన విల్లుతో

తల్లి రాసిన విల్లుతో

అయితే తల్లి రాసిన విల్లు ప్రకారం సారికకు ప్రస్తుతం గూడు లేని పరిస్థితి ఏర్పడింది. సారిక తల్లి కమల్ ఠాకూర్ తన మరణాంతరం తన ఇల్లు కుటుంబ స్నేహితుడు డాక్టర్ విక్రమ్ థక్కర్‌కు చెందాలని విల్లు రాసింది. ఆ విల్లులో పేర్కొన్న మేరకు ఇటీవల ఆ ఫ్లాట్‌ను అధికారులు సొంతం చేసుకోవడం జరిగింది.

శృతి హాసన్‌పై మండిపాటు

శృతి హాసన్‌పై మండిపాటు

సారిక పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో శృతిహాసన్, అక్షర హాసన్ పట్టించుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తల్లి పరిస్థితి అధ్వాన్వంగా ఉంటే శృతిహాసన్ ప్రియుడితో పెళ్లి వేడుకల్లో ఊరేగడం ఏమిటనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్ని విభేదాలు ఉన్నా ఇలా ప్రవర్తిస్తారా అనే వాదన వినిపిస్తున్నది. సారికకు అమీర్ ఖాన్ అండగా నిలబడటంపై హర్షం వ్యక్తమవుతున్నది.

రంగంలోకి అమీర్

రంగంలోకి అమీర్

ఇదిలా ఉండగా, సారికకు అమీర్ ఖాన్ కజిన్ నుజత్ సన్నిహితురాలు. సారిక దయనీయ పరిస్థితిని ఇటీవల అమీర్‌ఖాన్ దృష్టికి తీసుకురాగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

సమస్యకు పరిష్కారం.. అమీర్

సమస్యకు పరిష్కారం.. అమీర్

అమీర్ ఖాన్‌ను ఇటీవల సారిక కలిసి తన సమస్యను చెప్పుకోగా త్వరలోనే ఓ పరిష్కారం చూద్దాం అని చెప్పినట్టు సమాచారం. ఈ సమస్యను నేను స్టడీ చేస్తున్నాను. విక్రమ్ థక్కర్‌తో మాట్లాడుతున్నాను. సమస్య పరిష్కారమయ్యేలా నేను చూస్తాను అని అమీర్ చెప్పినట్టు తెలిసింది.

కమల్‌తో సారిక విడిపోవడం

కమల్‌తో సారిక విడిపోవడం

2004లో సారిక, కమల్ హాసన్ విడిపోయారు. విడాకులు తీసుకొనే సమయానికి వారికి శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు పిల్లలు. కమల్ హాసన్ వద్దే శృతి, అక్షర హాసన్ పెరిగి పెద్దయ్యారు. శృతి దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఉన్నారు. అక్షర హాసన్ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X