ఫుట్ బాల్ చారిటీ మ్యాచ్: సినీ సెలబ్రిటీల సందడి (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూతురు ఇరా....తండ్రి మాదిరిగానే పలు స్వచ్ఛంద సేవా సంస్థల కోసం తనవంతు సాయం చేస్తోంది. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరణ కోసం ఆమె ఫుట్ బాల్ చారిటీ మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేసారు. ముంబైలోని కూపరేజ్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, ఆదిత్యా రాయ్ కపూర్, సోహైల్ ఖాన్, అభిషేక్ బచ్చన్, టైగర్ ష్రాఫ్, కునాల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు అమీర్ ఖాన్ చిన్న కుమారుడు అజాద్ రావ్ ఖాన్ కూడా ఈ చారిటీ మ్యాచ్‌లో సందడి చేసాడు.
ఈ సందర్భంగా అమీఖార్ మీడియాతో మాట్లాడుతూ....సల్మాన్ ఖాన్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదాన్ని కొలిక్కి తెచ్చి రాజీ చేసే ప్రయత్నం చేస్తానన్నారు. స్లైడ్ షోలో మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలు.

ఆజాద్ రావ్ ఖాన్
అమీర్ ఖాన్ సన్ ఆజాద్ రావ్ ఖాన్. ఇటీవల సరోగసీ పద్దతి ద్వారా అమీర్ ఖాన్, కిరణ్ రావు ఈ బాబుకి జన్మినిచ్చారు.

ఫుట్ బాల్ ఆడుతున్న ఆజాద్ రావ్ ఖాన్
అమీర్ ఖాన్ తనయుడు ఆజాద్ రావ్ ఖాన్ కూడా ఫుట్ బాల్ ఆడుతూ సందడి చేసాడు.

తల్లి కిరణ్ రావ్ తో ఆజాద్
తల్లి కిరణ్ రావుతో కలిసి ఆజాద్ రావ్ ఖాన్

అమీర్ ఖాన్, అభిషేక్, హృతిక్
ఫుట్ బాల్ ట్రోపీతో బాలీవుడ్ స్టార్లు అభిషేక్ బచ్చన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్

కొడుకుతో అమీర్ ఖాన్
తన చిన్న కొడుకు ఆజాద్ రావ్ ఖాన్‌తో అమీర్ ఖాన్ సన్నిహితంగా గడుపుతూ కొడుకుపై తన అనురాగాన్ని, ఆప్యాయతను చాటుకున్నాడు.

హృతిక్ రోషన్
మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్న హృతిక్ రోషన్.

సొహైల్ ఖాన్
మ్యాచ్ అనంతరం అలసిపోయి రిలాక్స్ అవుతున్న బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు సొహైల్ ఖాన్

టైగర్ ష్రాఫ్
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఇలా గ్రౌండ్‌లో సందడి చేసాడు.

హృతిక్ రోషన్‌తో ఇరా ఖాన్
హృతిక్ రోషన్‌తో కలిసి అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్.


Click it and Unblock the Notifications











