కూతురుతో కలిసి అమీర్ ఖాన్ ఫోటో.... చండాలంగా ఉందని అభిమానుల విమర్శలు!
Recommended Video

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సోదరుడు మన్సూర్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుక ఇటీవల ముంబై సమీపంలో ఫాం హౌస్‌లో జరిగింది. అమీర్ ఖాన్ కుటుంబం మొత్తం ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను అమీర్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే ఇందులో తన కూతురు ఇరా ఖాన్‌తో దిగిన ఫోటో వివాదాస్పదం అయింది. ఈ ఫోటో సరిగా లేదని, తప్పుడు ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉందని కొందరు అభిప్రాయ పడ్డారు. ఇలాంటి ఫోటో షేర్ చేసి ఉండకూడదనే మరికొందరు సూచించారు.

విమర్శలకు కారణమైన ఫోటో ఇదే
వివాదానికి కారణమైన ఫోటో ఇదే. ఫాం హౌస్‌లో సరదాగా తన ఫ్యామిలీ, పిల్లలతో గడుపుతుండగా తీసిన ఫోటో. ఈ ఫోటోపై వేలాది కామెంట్లు వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా స్పందించారు. కొందరు అమీర్ ఖాన్ మీద తిట్ల వర్షం కురిపించారు.

భార్య, కుమారుడుతో కలిసి
ముంబై సమీపంలోని ఫాం హౌస్‌లో తన భార్య, కుమారుడితో కలిసి ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్న అమీర్ ఖాన్.

కుటుంబ సభ్యులతో కలిసి విందు
ఫాం హౌస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్న అమీర్ ఖాన్,.

కుమారుడితో కలిసి...
కుమారుడితో కలిసి ఫాం హౌస్‌లో అమీర్ ఖాన్.


Click it and Unblock the Notifications











