మణిరత్నం కొత్త చిత్రం ఖరారు..పూర్తి డిటేల్స్
ముంబై : రీసెంట్ గా కార్తీక్ నట వారసుడు గౌతమ్ కార్తీక్, రాధ చిన్న కుమార్తె తులసిని వెండితెరకు పరిచయం చేస్తూ కడల్‌ను తెరకెక్కించి పరాజయాన్ని చవిచూసిన మణిరత్నం... మరో కొత్త చిత్ర చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్,కరీనా కపూర్ కలిసి నటించనున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాన్సెప్ట్ ఏమిటంటే....భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారత్-పాకిస్తాన్ విడిపోయిన సందర్భాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దానికి కాస్త ప్రేమకథను కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సంచలన చిత్రాలను తెరకెక్కించే మణిరత్నం కథకు ఇప్పుడు ఈ అంశమే ముడిసరకుగా మారినట్లు సమాచారం.
ప్రస్తుతం కొత్త చిత్రం పనుల్లోనే మణిరత్నం పూర్తిగా ఉన్నారని తెలుస్తోంది. అమీర్ ఖాన్ కి స్టోరీ లైన్ నచ్చిందని, స్క్రిప్టు వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. హిందీలో వచ్చిన 'రంగ్‌దే బసంతి', 'కుర్బాన్' చిత్రాలకు కథ అందించిన రెన్సిల్ సిల్వా ఈ చిత్రానికి పనిచేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మిగతా వివరాలు స్లైడ్ షో లో...

అమీర్ ఖాన్, కరీనా కపూర్ కలిసి...గతంలో 3 ఇడియట్స్ అనే సూపర్ హిట్ లో చేసారు. అలాగే అమీర్ లేటెస్ట్ తలాష్ చిత్రంలో కూడా ఆమె నటించింది.

గతంలో మణిరత్నం దర్శకత్వంలో లో వచ్చిన యువలో ఆమె చేసింది. అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్ లో కూడా ఈ పెయిరే ఉంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అమీర్ ఖాన్ కి మొదటి నుంచి మణిరత్నం అంటే అభిమానం. ఆయన దర్శకత్వంలో చేయాలని అమీర్ ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు.

మరో ప్రక్క మణిరత్నంకు వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 'ముంబయ్' చిత్రం తీసినప్పటి నుంచి ఆయనకు వ్యక్తిగత భద్రత ఉండేది. దీన్ని ఇటీవల ఉపసంహరించారు. ప్రస్తుతం తమిళ చిత్రం 'కడల్' వ్యవహారంలో పంపిణీదారులు మణిరత్నంను బెదిరించారు.

అయితే ఈ ప్రాజెక్టు విషయమై మణిరత్నం తో సహా ఎవరూ నోరు మెదపటం లేదు. మీడియా వారు ప్రశ్నించినా సమాధానం ఇవ్వటం లేదు.


Click it and Unblock the Notifications











