ఫోటోలు : అమీర్- కత్రినా డేంజరస్ స్టంట్స్
ముంబై : బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ ధూమ్-3 చిత్రంలో తొలిసారి కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి సంబంధించని తాజా స్టిల్స్ విడుదలయ్యాయి. వారు చేసే స్టంట్స్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో స్లైడ్ షోలో వీక్షించండి.
అమీర్ ఖాన్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తను చేసే పాత్ర తెరపై పర్‌ఫెక్ట్‌గా కనిపించడం కోసం ఎంతకష్టమైనా పడతాడు. ఎలాంటి సాహసాలైనా చేయడానికి వెనకాడడు. అందులో భాగంగా ఈ చిత్రంలో డేర్ డెవిల్ స్టంట్స్ చేసాడు అమీర్.
అయితే తాను కూడా అమీర్‌తో పోటాపోటీగా స్టంట్స్ చేస్తూ ఏమీ తక్కు కాదని నిరూపించుకుంటోంది. డూప్ లేకుండా స్వయంగా పాల్గొంటోంది. చిన్నచిన్న గాయాలైనా ఎలాంటి భయం లేకుండా అదరగొడుతోంది. వీరి సాహసాలు తెరపై ఉత్కంఠ రేపే విధంగా ఉంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ధూమ్ 3 చిత్రానికి విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా ముఖ్య తారాగణం. ప్రీతమ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ధూమ్ 3 లీడ్ స్టార్స్ అమీర్, కత్రినా ఇటీవల సినిమాకు సంబంధించిన ఫైనల్ సీన్స్‌లో పాల్గొంటూ కెమెరాకు చిక్కారు.

డేంజరస్ స్టంట్స్ చేస్తూ కత్రినా

ఈ సన్నివేశాలను స్విట్జర్లాండ్‌లోని ఓ భారీ డ్యామ్ వద్ద చిత్రీకరించారు.

యాక్షన్ సీన్లు చేయడం కోసం కత్రినా జిమ్ లో బాగా వర్కౌట్లు చేయడంతో పాటు, నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకమైన డైట్ తీసుకుంటోంది.

ఈ చిత్రంలో అమీర్ ఖాన్ సూపర్ దొంగగా కనిపించనున్నాడు.

అమీర్ చేసే ఫీట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండనున్నాయి.

మేకప్ ఆర్టిస్ట్ మీరాతో కలిసి అమీర్, కత్రినా

ధూమ్ 3 ఆన్ లొకేషన్ స్టిల్

గతంలో ఫనా చిత్రంలో నెగెటివ్ రోల్ చేసిన అమీర్, ఇప్పుడు ఈ చిత్రంలోనూ మరోసారి నెగెటివ్ పాత్రకు జీవం పోయనున్నాడు.

షూటింగ్ దాదాపు పూర్తయింది. డిసెంబర్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో అమీర్, కత్రినాతో పాటు అభిషేక్, ఉదయ్ చోప్రా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











