For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Laal Singh Chaddha Twitter Review: రిలీజ్ రోజే అమీర్‌కు షాక్.. సినిమా టాక్ ఇలా.. నాగ చైతన్య మాత్రం!

  |

  బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.. ఈ పేరు తెలియని వారు చాలా అరుదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా తన విలక్షణ నటనతో దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారాయన. ఏజ్ బార్ అవుతోన్నా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు పెద్దగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అమీర్ ఇప్పుడు 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో నటించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీ ఈరోజే విడుదల అయింది. ఇప్పటికే చాలా షోలు ప్రదర్శితం అయ్యాయి. ఈ నేపథ్యంలో 'లాల్ సింగ్ చద్దా' మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  Recommended Video

  లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
  లాల్ సింగ్ చద్దాగా వచ్చిన అమీర్

  లాల్ సింగ్ చద్దాగా వచ్చిన అమీర్

  బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రమే ‘లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ సినిమాను అమీర్ ఖాన్ సొంత బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించగా.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కీలకమైన పాత్రను పోషించాడు. తంజు టికు, ప్రీతమ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

  అలాంటి స్టోరీ... ఎంతో ఎమోషనల్

  అలాంటి స్టోరీ... ఎంతో ఎమోషనల్


  అమీర్ ఖాన్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే ‘లాల్ సింగ్ చద్దా'. అమాయకత్వం ఉన్న ఓ యువకుడు ఇండియన్ ఆర్మీలో చేరడం.. అక్కడ ఎదురైన సంఘటనలతో పరివర్తన చెందడం అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించారు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం ఎంతో ఎమోషనల్‌గా సాగుతుందని తెలిసింది. దీంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి.

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్ రిలీజ్

  బిజినెస్ తగ్గట్లుగా.. గ్రాండ్ రిలీజ్

  అమీర్ ఖాన్‌కు ఇండియాలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘లాల్ సింగ్ చద్దా' మూవీ హక్కులకు ఎవరూ ఊహించని రీతిలో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 300 కోట్లు పైగా బిజినెస్‌ను జరుపుకుందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

  Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

  అమీర్ ఖాన్ మూవీకి టాక్ ఏంటి

  అమీర్ ఖాన్ మూవీకి టాక్ ఏంటి


  అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా' కామెడీ అండ్ ఎమోషనల్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్, యూకే, అరబ్ కంట్రీస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ట్విట్టర్ వేదికగా ఎక్కువ మంది ఈ సినిమా బాగుందని చెప్తున్నారు.

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

  ‘లాల్ సింగ్ చద్దా' మూవీ ఓవరాల్‌గా చూస్తే.. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ అద్వైత్ చందన్ ఎంతో సమయం తీసుకున్నాడట. ముఖ్యంగా పాత్రలను పరిచయం చేయడానికే చాలా టైం పట్టిందట. అయితే, ఇంటర్వెల్ మాత్రం సూపర్‌గా ఉందని తెలిసింది. ఇక, సెకెండాఫ్ మాత్రం ఎంతో ఎమోషనల్‌గా సాగి, ఊహించని క్లైమాక్స్‌తో ముగుస్తుందని టాక్.

  బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

  సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

  ఆర్మీ ఆఫీసర్ ఎమోషనల్ జర్నీగా మూవీగా వచ్చిన ‘లాల్ సింగ్ చద్దా'ను చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో అమీర్ ఖాన్ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, కామెడీ, ఇంటర్వెల్, ఎమోషన్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, లాజిక్ లేని సన్నివేశాలు, పాటలు, ఫస్టాఫ్ దీనికి మైనస్‌గా మారాయని తెలిసింది.

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  మొత్తంగా మూవీ ఎలా ఉందంటే

  ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా' కామెడీ అండ్ ఎమోషన్స్‌తో సాగే మూవీ అని తెలుస్తోంది. ఇందులో అమీర్ ఖాన్ తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తాడట. అలాగే, కరీనా కపూర్ కూడా మంచి పాత్రను చేసిందని తెలిసింది. మొత్తంగా ఈ మూవీ అన్ని వర్గాల వాళ్లను అలరించే చిత్రంగా నిలుస్తుందని సమాచారం.

  పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

  నాగ చైతన్యను చాలా కొత్తగానే

  నాగ చైతన్యను చాలా కొత్తగానే


  ‘లాల్ సింగ్ చద్దా' మూవీలో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్‌కు ఆర్మీలో కలిసిన తెలుగు యువకుడి పాత్రలో నటించిన అతడు.. అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడట. తెలుగు దర్శకులు చూపించని విధంగా అద్వైత్ చైతూను ప్రజెంట్ చేశాడని అంటున్నారు. మొత్తంగా ఈ చిత్రంతో అతడి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది.

  తొలిరోజే అమీర్‌కు బిగ్ షాక్

  తొలిరోజే అమీర్‌కు బిగ్ షాక్


  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘లాల్ సింగ్ చద్దా' మూవీని బ్యాన్ చేయాలని చాలా రోజులుగా ఓ డిమాండ్ వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు సినిమా రిలీజ్ రోజే BoycottLalSinghChaddha అనే ట్యాగ్‌ను చాలా మంది ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఫలితంగా ఈ సినిమాపై నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆదిలోనే అమీర్ ఖాన్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది.

  English summary
  Bollywood Star Hero Aamir Khan Did Laal Singh Chaddha Movie Under Advait Chandan Direction. Now Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X