టాప్ హీరో...షాకింగ్ లేడీ అవతార్!
హైదరాబాద్ : అమీర్ ఖాన్ ఏమి చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు. అందుకే అతన్ని అందరూ 'మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్' అంటారు. మగాడు మగాడిలా నటించడంలో గొప్పేముంది...ఆడ వారి గెటప్ లో కూడా తాను పర్ ఫెక్ట్ గా నటించగలను అని అమీర్ ఖాన్ ఇప్పటికే నిరూపించాడు.
గతంలో ఆయన 'బాజీ' అనే సినిమాలో క్యాబరే పాటలో అమ్మాయిగా నటించాడు. తాజాగా అమీర్ ఖాన్ ఓ వాణిజ్య ప్రకటన కోసం లేడీ అవతారం ఎత్తారు. ఇందులో ఆయన అచ్చమైన భారతీయ స్త్రీ గెటప్ లో కనిపించనున్నారు. యాడ్ ఫిల్మ్స్ కోసం కూడా ఆయన ఇలాంటి గెటప్ వేయడానికి ఒప్పుకోవడం గమనార్హం.
ఏమి చేసినా చాలా పర్ఫెక్ట్ గా చేసే అమీర్ ఖాన్....ఈ తాజా లేడీ గెటప్ కోసం మైకీ కాంట్రాక్టర్ అనే మేకప్ ఆర్టిస్టును తెప్పించుకుని మేకప్ వేయించుకున్నారట. ఈ మేకప్ కోసం రోజుకు రెండు సార్లు షేవిగ్ చేసుకోవాల్సి వస్తుందట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన్ను అంతా మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అని ఎందుకు అంటారో?
దీంతో పాటు ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'పికే' సినిమాలో కూడా అమీర్ వింత గెటప్ లో కనిపించనున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ.


Click it and Unblock the Notifications












