రెడ్ లైట్ ఏరియాలో ఆడియో వేడుక
ఈచిత్రానికి సంబంధించి ఓ ఆసక్తిర విషయం వినపడుతోంది. ఈచిత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమం ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ధూమ్ 3 షూటింగులో పాల్గొంటున్న అమీర్ ఖాన్ త్వరలోనే ఇండియాకు రానున్నారని, వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో ఈ ఆడియో వేడుక నిర్వహిస్తారని ముంబై సినీ వర్గాల టాక్.
మరో వైపు ఈ చిత్రం ఫైనల్ కాపీపై హీరో అమీర్ అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని సీన్లు సరిగా లేక పోవడంతో వాటిని రీషూట్ చేయాలనే దిశగా దర్శక నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. లేక పోతే మిస్టర్ పెర్ ఫెక్షనిస్ట్ అనే తన ఐకాన్‌కు మచ్చ వస్తుందని అమీర్ తేల్చిచెప్పినట్లు సమాచారం.
'తలాష్'కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. గతంలో షారూక్‌ఖాన్ 'డాన్2' చిత్రానికి ఇవే థియేట్రికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి. దాంతో ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లైంది.


Click it and Unblock the Notifications












