కొడుకుకి వెరైటీగా నామకరణం చేసి అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, భార్య కిరణ్ రావు ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ రావుకు గతంలో గర్భ స్రావం కావడంతో వైద్యుల సలహా మేరకు అద్దెగర్భం(వేరొక మహిళ గర్భంలో వీరి బిడ్డను పెంచడం) ద్వారా డిసెంబర్ 1న వారసున్ని కన్నారు ఈ స్టార్ కపుల్. తాజాగా తన కొడుకుకి పేరు పెట్టినట్లు అమీర్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రకటించారు. మా వాడి పేరు 'ఆజాద్ రావు ఖన్' అంటూ వెల్లడించారు.
ఆజాద్ అంటే స్వాతంత్రం. ఇది మా గ్రేట్ గ్రాండ్ అంకుల్ మౌలానా ఆజాద్ పేరు. ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. మేమంతా ఆయన కుటుంబ సభ్యలవ్వడం ఇప్పటికీ గర్వంగా పీలవుతున్నాం.... మా వాడికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ పేరు ఎంపిక చేసింది నా ముద్దుల పెళ్లామే..... అంటూ వ్యాఖ్యానించారు. కొడుకు పుట్టడంతో అమీర్ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ పది రోజుల నుంచి సన్నిహితులకు, స్నేహితులకు ట్రీట్ ఇస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అమీర్.


Click it and Unblock the Notifications











