‘పరువు హత్యలే’ లక్ష్యంగా సూపర్ స్టార్!
తాజాగా మొదలైన 'సత్యమేవ జయతే' 5వ ఎపిసోడ్‌లో....భారత్‌లో జరుగుతున్న 'పరువు హత్య'లను లక్ష్యం చేసుకున్నాడు. భారత్‌లో ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కులాంతర, మతాంత వివాహాలు చేసుకున్న వారిని కుటుంబ సభ్యులే పరువు కోసం హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆఖరికి ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా సొంత నిర్ణయాలపై కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే పరిస్థితి ఇక్కడ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో దీనిపై చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అమీర్ ఖాన్. కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని అయిన వాళ్లకు దూరంగా ఉంటున్న వారిని, పరువు హత్యలతో ఆత్మీయులను కోల్పోయిన వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువు జంటలు స్పందిస్తూ....ఇంట్లో వాళ్లని వ్యతిరేకించి పెళ్లి చేసుకుని ప్రతిక్షణం భయపడుతూ బ్రతుకుతున్నామని, తమ ఎప్పుడు చంపేస్తారో అని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామని చెప్పుకొచ్చారు. పరవు హత్యల కారణంగా కడుపుకోతకు గురైన పలువురు తల్లిదండ్రులు కూడా ఈ షోకు హాజరై తమ ఆవేదన వెల్లగక్కారు.
ఈ కాలంలో కూడా దేశంలో ఇలాంటి పిరిస్థితులు నెలకొని ఉండటం చాలా దారుణమని, అప్పట్లో హర్యానాలో ఒకే గోత్రానికి చెందిన వారు పెళ్లి చేసుకున్నందుకు దారుణంగా హత్యచేసిన ఘటన తనకు ఎంతగానో కదిలించిందని అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇష్టాను సారంగా దేశ ప్రధానిని, ముఖ్యమంత్రులను ఎంచుకునే హక్కు ఉన్న ఈ దేశంలో తమ మనసుకు నచ్చిన వారిని జీవిత భాగస్వాములుగా ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోయిందని, ఈ పరిస్థితులు ఇకనైనా మారాలనే ఉద్యేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications












