జైలు నుండి వచ్చాడుగా, సంజయ్‌కి ‘పికె’ స్పెషల్ షో
హైదరాబాద్: యరవాడ జైలు నుండి రెండు వారాల సెలవుపై విడుదలైన సంజయ్ దత్ కోసం ‘పికె' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారట. ఈ విషయాన్ని ‘పికె' చిత్ర టీం స్పష్టం చేసింది. ‘పికె' సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన సంజయ్ దత్ షూటింగ్ తర్వాత జైలుకెళ్లాడు. దాంతో సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనలేక పోయాడు. ప్రస్తుతం ఆయన జైలు నుండి బయటకు రావడంతో ముంబైలోని శాంతాక్రూజ్ థియేటర్లో ‘పికె' చిత్ర బృందంతో కలిసి కుటుంబ సమేతంగా సినిమా వీక్షించనున్నాడు.
1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ గతేడాది మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

పికె సినిమా విషయానికొస్తే...అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఇటీవల విడులైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. ఇప్పటికే ఈచిత్రం వసూళ్లు 100 కోట్లు దాటింది.


Click it and Unblock the Notifications











