విలన్ గా చేయటానికి కమిటయిన స్టార్ హీరో
ప్రయోగాలన్నా,వైవిద్యమన్నా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి భలే ఆసక్తి. అందుకు తగినట్లుగానే అతను ఎప్పుడూ తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటాడు. తాజాగా యష్ రాజ్ వారి చిత్రంలో విలన్ గా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేసారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే 'ధూమ్ 3'లో నెగిటివ్ రోల్ లో విలన్ గా నటించబోతున్నాడు. ఈ సినిమాకి విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తారు. ధూమ్, ధూమ్ 2 లలో అభిషేక్ బచ్చన్, ఉదయ్‌చోప్రా హీరోలుగా నటించారు. ఈ మూడో చిత్రానికి వారినే తీసుకున్నారు. ఇక 'ధూమ్'లో జాన్ అబ్రహమ్, 'ధూమ్ 2'లో హృతిక్‌రోషన్ విలన్స్ గా కనిపించి అదరకొట్టారు. దాంతో ఈ మూడో సీక్వెల్ మెగా స్టార్ హీరో...విలన్ అయితే యశ్‌చోప్రా భావించారు. దాంతో అమీర్ ని సంప్రదించటం.ఆయన ఓకే చేసేయటం క్షణాల్లో జరిగిపోయాయి. ఈ విషయమై యాష్ చోప్రా మాట్లాడుతూ..ధూమ్ -3 లో ఆ పాత్ర ఎంతో కీలకమైనది. అమీర్ నటించేందుకు అంగీకరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సంవత్సరం ఆఖరులో ఈ చిత్రం షూటింగ్ చివర్లో మొదలవుతుంది. వచ్చే క్రిస్మస్‌కి విడుదల చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











