అమీర్ ఖాన్ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో....
త్రి ఇడియట్స్ మరో సారి సంచలనంగా నిలిచి రికార్డులు సృష్టించిన అమీర్ ఖాన్ తాజాగా మరో చిత్రం కమిట్ అయ్యారు. మళయాళ మాంత్రికుడుగా పేరున్న ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సారి మిస్టర్ ఫెరఫెక్ట్ చేయనున్నారు. బాలీవుడ్ సమాచారం ప్రకారం ప్రియదర్శన్ చెప్పిన కథ విని ధ్రిల్లయిన అమీర్ త్వరలోనే షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అలాగే ఈ చిత్రంలో మళయాళ మహా నటుడు మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు. ఈ విషయమై ప్రియదర్శన్ మీడియాతో మాట్లాడుతూ..నా తర్వాత చిత్రం చాలా అర్ధవంతంగా, సహజంగా ఉంటుంది. నేను అమీర్ కి కథ చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. అయితే ఇంకా అతనికి బౌండ్ స్క్రిప్టు సబ్ మిట్ చేయలేదు అన్నారు.
అయితే ఇంతకుముందు ప్రియదర్శన్ ఇద్దరు ఖాన్ లు తో తీసిన 'క్యోంకీ' (సల్మాన్ ఖాన్), 'బిల్లూ' (షారుఖ్ ఖాన్) చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యీయి. దాంతో ఈ అమీర్ ఖాన్ తో ఎలాంటి చిత్రం ఇస్తారో అనే టాక్ అప్పుడే బయిలుదేరింది. ఇక ప్రస్తుతం ప్రియదర్శన్..తన హీరో అక్షయ్ కుమార్, త్రిష కాంబినేషన్లో కట్టా మీటా అనే చిత్రం చేస్తున్నారు. అలాగే ప్రియదర్శన్, అమీర్ ఖాన్ ల కాంబినేషన్లో వచ్చే చిత్రం 'కంజీవరం' లాంటి బరువైన కథాంశంతో ఉంటుందని చెప్పుకుంటున్నారు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టేది..మిగిలిన స్టార్ కాస్టింగ్ వివరాలు త్వరలో వెల్లడిస్తారు.


Click it and Unblock the Notifications











