ఆ స్టార్ హీరో...బెడ్రూంలో భార్యకు సగం తృప్తేనా?
ముంబై : సినిమాల్లో హీరోలు బెడ్రూం సీన్లు ఇరగ దీస్తూ ఉంటారు. సినిమాల్లోని శృంగార సీన్లలో వారు చేసే విన్యాసాలు చూసి......నిజ జీవితంలో తమ భర్తలు కూడా అలా ఉంటే ఎంత బావుంటుందో! అని ఊహించుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఒక ఈ విషయం మాత్రమే కాదు, చాలా విషయాల్లో వారు అదరగొడుతుంటారు.
మరి సినిమాల్లో ఆ రేంజిలో రెచ్చిపోయే యాక్టర్లు నిజజీవితంలోనూ అలానే ఉంటారా? ఇదే విషయాన్ని ఆ యాక్టర్లను అడిగితే ఎలా స్పందిస్తారు? ఇలాంటి ఆసక్తికర అంశాలను స్వయంగా వారి నోటి నుండి రాబడుతూ సాగుతున్న షో 'కాఫీ విత్ కరణ్'. ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార ఈ షోను నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ షోకు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్, అతని భార్య కిరణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పలు విషయాల్లో ఆయన తనకు తాను యావరేజ్ రేటింగే ఇచ్చుకున్నారు.
తండ్రిగా, నటుడిగా, దర్శకుడిగా అమీర్ ఖాన్ 10కి 5 మార్కులు మాత్రమే వేసుకున్నారు. అంతే కాదు....బెండ్రూంలో భార్యకు పడక సుఖం పంచడంలోనూ యావరేజ్ రేటింగే ఇచ్చుకున్నారు. బెడ్రూంలో మీ భార్యను సుఖ పెట్టే విషయంలో మీకు మీరు 10కి ఎన్ని మార్కులు వేసుకుంటారు? అనే ప్రశ్నకు అమీర్ బదులిస్తూ...10కి 5 మార్కులు మాత్రమే వేసుకుంటాను అన్నారు అమీర్.
48 ఏళ్ల అమీర్ ఖాన్ తనకంటే 8 సంవత్సరాలు చిన్నదైన కిరణ్ రావును 2005లో రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అమీర్ అంతుకు ముందు నటి రీనా దత్తను పెళ్లాడాడు. 2002లో వీరు విడిపోయారు. అమీఖాన్ మొత్తం మొగ్గరు పిల్లలు. మొదటి భార్య ద్వారా ఇద్దరు, రెండో భార్య ద్వారా ఒకరు.


Click it and Unblock the Notifications











