Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బయటకి వస్తున్న సీక్రెట్ సూపర్‌స్టార్: ఈ రోజు సాయంత్రం ట్రైలర్ విడుదల చేయనున్న అమీర్ ఖాన్
సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా రెండో పోస్టర్‌ను షేర్ చేశాడు అమీర్. ఈరోజు సాయంత్రం 6:30 గం.లకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ట్వీట్లో పేర్కొన్నాడు.
విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. దంగల్, పీకే వంటి బ్లాక్బస్టర్లతో పాటు అప్పుడప్పుడు తారేజమీన్‌పర్ వంటి చిన్న చిత్రాలతోనూ తలుక్కున మెరిసే ఆమిర్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు.
ఈరోజు సాయంత్రం
ఈరోజు సాయంత్రం 6:30 గం.లకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఆమిర్ ట్వీట్లో పేర్కొన్నాడు. జూలై 31న ఆయన ఈ సినిమాకు సంబంధించి మొదటి పోస్టర్ విడుదల చేశాడు. ఈ సినిమాకు సంబధించిన రెండో పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు అమీర్.
తారే జమీన్ పర్
ఈ రెండో పోస్టర్ ద్వారా ఆ సినిమా సీక్రెట్ ను విప్పేశాడు.ఆ పోస్టర్ చూసి `తారే జమీన్ పర్` లాంటి సినిమా రాబోతుందని అభిమానులు ఆశించారు. ఈ రెండో పోస్టర్లో `దంగల్`లో ఆమిర్‌తో పాటు నటించిన జైరా వసీం పాఠశాల దుస్తుల్లో గిటార్ వాయిస్తున్నట్లు ఉంది. వెనకాల ఆమిర్ రాక్‌స్టార్ అవతారంలో కనిపిస్తున్నాడు.
ఆమిర్‌ఖాన్, జైరా వాసిం
అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్, జైరా వాసిం, మేహర్ విజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గాయనిగా తనేంటో లోకానికి చాటి చెప్పాలని కలలు కనే ఓ చిన్నారి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తండ్రి ప్రతిరోజు తాగి వచ్చి తల్లితో పాటు తనని చిత్రహింసలు పెడుతుంటే ఆ చిన్నారి తన తల్లిని తాగుబోతు తండ్రి నుంచి కాపాడుకొని తన ఆశయం ఎలా నెరవేర్చుకుంటుందనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఆగస్టు 2న అంటే ఈరోజు సాయంత్రం
దీపావళికి తెరపైకి కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఆగస్టు 2న అంటే ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. `తారే జమీన్ పర్` సినిమాతో చిన్నపిల్లలతో ఆమిర్ నటన ఎంత బాగుంటుందో తెలిసింది. ఈ సినిమాతో కూడా అలాంటి మేజిక్ చేస్తాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.