twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "నా ఆడ పిల్లలు మగాళ్ళకంటే ఏం తక్కువ?" పోస్టర్ తోనే సినిమా చెప్పేసాడు

    |

    బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగి పోతాయి. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగల నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అమీర్ ఖాన్ రెజ్లింగ్ వీరుడు మహా వీర్ సింగ్ ఫోగాట్ జీవిత కథ ఆధారంగా వస్తూన్న సినిమా "దంగల్" కోసం ఏ క్యారెక్ట‌ర్‌లోనైనా జీవించే అమీర్‌ఖాన్ ప్ర‌త్యేకంగా త‌న బాడీని మ‌లచుకున్నాడు. మ‌హావీర్ పోగ‌ట్ వృద్ధాప్యంలో ఉన్న పాత్ర కోసం పూర్తి స‌న్న‌బ‌డిన అమీర్‌.. య‌వ్వ‌నంలో ఉన్న పాత్ర కోసం కండ‌లు పెంచాడు.

    కథ ఎంచుకోవడం దగ్గర్నుంచి దాన్ని సమర్థవంతంగా తెరకెక్కించడం కోసం అమీర్ చూపించే శ్రద్ధ ఇండియాలోని మిగతా హీరోలందరికీ ఆదర్శం. చివరగా "పీకే"తో భారతీయ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. దాని తర్వాత రెజ్లర్ మహవీర్ పొగట్ నిజ జీవిత కథతో "దంగల్" అనే సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం 95 కిలోల వరకు బరువు పెరగడం.. మళ్లీ బరువు తగ్గి కండలు తిరిగిన దేహంతో ఈ మధ్యే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడం తెలిసిందే.

    dangal new look

    షూటింగ్ దశలోనే విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న "దంగల్" ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో జనాల ముందుకొచ్చేసింది. ఈ రోజే ట్విట్టర్లో "దంగల్" ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు అమీర్ ఖాన్. నలుగురు పిల్లల తండ్రిగా మిడిలేజ్డ్ క్యారెక్టర్లో అమీర్ లుక్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.

    ఒక మామూలు గ్రామీణ వస్త్రధారన తో ఉన్న అమీర్ ఈ లుక్ లో మరీ ఫెమిలియర్ గా కనిపిస్తున్నాడు. "మ్హారీ చోరియా చోరో సే కం హై కే..!" మా ఆడ పిల్లలు మగ పిల్లలకంటే ఏం తక్కువ? అని ఉన్న క్యాప్షన్ సినిమాలో ఉఇండే కీలకమైన పాయింట్ ని చెప్పకనే చెబుతోంది.

    dangal new look

    ఈ సినిమాలో కేవ‌లం ఒక ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ మాత్ర‌మే ఉంటుంద‌ని స‌మాచారం. సినిమాలో అమీర్ కూతుళ్లుగా న‌టిస్తున్న ఫాతిమా స‌నా షేక్‌, స‌న్యా మ‌ల్హోత్రాల‌తో ఆ ప్ర‌మోష‌న‌ల్ సాంగ్ ఉంటుంద‌ని, మ‌రే పాట‌లు సినిమాలో ఉండ‌వ‌ని చెబుతున్నారు.

    అయితే ఈ సినిమాకు చెందిన వ‌ర్గాలు మాత్రం ఈ వార్త‌ల‌ను ఖండిస్తున్నాయి. సినిమాకు ప్రీత‌మ్ మ్యూజిక్ అందిస్తున్నార‌ని, టాకీ చిత్రీక‌ర‌ణ పూర్తయిన త‌ర్వాత పాట‌ల చిత్రీక‌ర‌ణ ఉంటుంద‌ని తెలిపాయి. అమీర్ ఖానే తన సొంత బేనర్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకుడు. ఈ ఏడాది డిసెంబరు 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Amir Khan's "dangal" poster shows him as a middle-aged wrestler who is accompanied by his daughters. The tagline of the wrestling drama goes: “Mhari choriyan choro se kam he kai (Are my daughters any less than boys)?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X