సినిమా బడ్జెట్ కాదు..మన హీరో పారితోషికం ఏకంగా వంద కోట్లు..!
హాలీవుడ్ తారలు ఏభై కోట్లు, వంద కోట్లు పారితోషికాల రూపేణా తీసుకుంటారని వినేవాళ్ళం. ఇప్పుడిది మన దేశంలో కూడా నిజమవుతోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ త్వరలో ఓ సినిమాకి అక్షరాలా వంద కోట్లు తీసుకుంటున్నాడన్న వార్త బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే 'ధూమ్-3' సినిమాకి ఆమిర్ పారితోషికం మొత్తం వంద కోట్లట. డైరెక్ట్ గా ఇచ్చేది 10 కోట్లయితే, ఆ సినిమా విదేశీ హక్కులు కూడా రెమ్యునరేషన్ లో భాగంగా తీసుకోవడం వల్ల మరో తొంభై కోట్ల వరకు వస్తాయంటున్నారు.
ఆమధ్య ఆమిర్ నటించిన 'గజని', '3 ఈడియేట్స్' సినిమాలు స్టార్ గా ఆమిర్ స్టామినాని తెలియజేసాయి. '3 ఈడియేట్స్' అయితే మొత్తం ఇంటా, బయటా కలిపి 300 కోట్లు కలెక్ట్ చేసింది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ 'ధూమ్-3' అయితే, 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే, ఇప్పుడు బాలీవుడ్ లో ఆమీరా? మజాకానా? అంటున్నారు..!


Click it and Unblock the Notifications











