For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అపుడు రజనీ సర్ ఆరోగ్యం బోగోలేదు, రోబో ‘2.0’ నన్ను చేయమన్నారు: అమీర్ ఖాన్ సంచలనం

  By Bojja Kumar
  |

  ఇండియన్ సినిమా స్క్రీన్ మీద రోబో అంటే భారతీయులందరికీ గుర్తొచ్చేది కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రమే. 2010లో రజనీ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' చిత్రం భారీ విజయం సాధించింది. త్వరలో ఈచిత్రానికి సీక్వెల్‌గా '2.0' అనే సినిమా రాబోతోంది.

  అయితే ఇటీవల ఇంటర్వ్యూలో బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఆసక్తికర విషయం వెల్లడించారు. '2.0' చిత్రాన్ని దర్శకుడు శంకర్ తనకు ఆఫర్ చేశారని, తాను స్క్రిప్టు కూడా చదివానని, సినిమా పెద్ద హిట్టవుతుందని నాకు అప్పుడే అర్థమయింది అన్నారు.

  రజనీ సర్ నా పేరు సూచించారట

  రజనీ సర్ నా పేరు సూచించారట

  అప్పట్లో రజనీ సర్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ‘2.0' నేను చేయలేను, అమీర్ ఖాన్ అయితే బావుంటుంది, అతన్ని ఒకసారి అడిగి చూడు అని శంకర్‌కు సూచించారట. దాని గురించి ర‌జ‌నీ సర్ నాకు కాల్ కూడా చేశారు. శంకర్ వెంటనే నా వద్దకు ‘2.0' స్క్రిప్టుతో వచ్చారు అని.... అమీర్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  రోబో పాత్రలో రజనీ సర్ మాత్రమే కనిపించారు

  రోబో పాత్రలో రజనీ సర్ మాత్రమే కనిపించారు

  2.0 స్క్రిప్ట్ చ‌దువుతున్న‌పుడు `రోబో` పాత్రలో త‌న‌కు ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే క‌నిపించారు, ఆయ‌న స్థానంలో నన్ను ఊహించుకోలేకపోయాన‌ు, అందుకే నేను సినిమా చేయ‌లేన‌ని శంక‌ర్‌కి చెప్పాను... అని అమీర్ ఖాన్ తెలిపారు.

  ఇండియన్ రోబో రజనీ సర్ మాత్రమే

  ఇండియన్ రోబో రజనీ సర్ మాత్రమే

  నేను రజనీ సర్‌కు పెద్ద అభిమానిని. ఆయ‌న పాత్రలో న‌న్ను నేను ఊహించుకోలేక‌పోయా. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు అని దర్శకుడు శంకర్ కు కూడా చెప్పాను అని అమీర్ ఖాన్ తెలిపారు.

  ఇండియన్ బిగ్ మూవీ

  ఇండియాలోనే ఈచిత్రాన్ని బిగ్గెస్ట్ చిత్రంగా రూపొందిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, బాలవుడ్ స్టార్ అక్షయ్ కుమర్ విలన్ పాత్ర చేస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే తొలిసారిగా రూ. 450 కోట్లు ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు.

  లేడీ రోబోగా హాట్ బ్యూటీ

  లేడీ రోబోగా హాట్ బ్యూటీ

  ఈ చిత్రంలో ఆడ రోబోగా అమీ జాక్సన్ నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ ప్రపంచం కేవలం మనుషులది మాత్రమే కాదు... అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్ ఉండటం గమనార్హం.

  రోబోల మధ్య ప్రేమ

  రోబోల మధ్య ప్రేమ

  గతంలో వచ్చిన శంకర్ రోబో సినిమాలో.... రోబోకు సొంతగా ఆలోచించే తెలివితో పాటు మనిషి మాదిరిగా మనసు కూడా సెట్ చేశారు. ప్రేమ, కోపం, ఎఫెక్షన ఇలా అన్నీ ఫీలయ్యేలా ఫ్రోగ్రామ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి సినిమాలో రజనీ రోబో, అమీ జాక్సన్ రోబో క్యారెక్టర్ల మధ్య లవ్, రొమాన్స్ ఉంటుందని సమాచారం.

  ఆడియో వేడుక భారీగా

  ఆడియో వేడుక భారీగా

  2.0 సినిమా ఆడియో వేడుక ఈనెల 27న దుబాయ్‌లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. వచ్చే జనవరి 25(2018)న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  మెస్మరైజ్ చేయనున్న 3డి

  ‘2.0' చిత్రం 3డి ఎఫెక్టులతో ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించనుంది. ఇండియాలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న 3డి సినిమా ఇది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి త్రీడీ మేకింగ్ వీడియోను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.

  English summary
  In a recent chat with Komal Nahta, Aamir Khan revealed that he was offered Rajinikanth’s role in 2.0. Aamir said that he read the script and was extremely convinced that this film was going to break all the records. He mentioned that even Rajinikanth called him to take up the project as he was facing certain health issues. Aamir then said that no matter how much he tried, he could have never aced the role the way Rajinikanth did and every time he closed his eyes he could only picture the senior actor doing the character.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X