twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లైమాక్ హీరోనే రాసారు..

    By Staff
    |

    AR Murugadas
    నిజానికి ఆ క్లైమాక్స్ తిరిగి మళ్ళీ రాయికపోతే అంత హిట్ అయ్యేది కాదేమో అంటున్నారు మురగదాస్. తన లేటెస్ట్ వెంచర్ 'గజనీ' గురించి మాట్లాడుతూ...తమిళ స్క్రిప్టులో పెద్ద మార్పులు చేయటానికి అమీర్ ఖాన్ ఒప్పుకోలేదు. అయితే క్లైమాక్స్ లో విలన్ ఇద్దరుగా కనపడి హీరోని కన్ఫూజ్ చేయటం మాత్రం ఆయనకు నచ్చలేదు.అయితే నా సజెషన్ కూడా అడగలేదు. ఆయనే ఆ సీన్ మొత్తం రాశారు. లొకేషన్,డైలాగ్స్ అన్నీ మార్చారు.

    అందుకే ఈ రోజు ఆ సినిమా అందరి ప్రశంసలూ పొందుతోంది. ఆ సీన్ పూర్తి చేసాక చూస్తే నాకే ఎమేజింగ్ గా అనిపించింది. ఆయనలో మంచి క్రియేటివిటీ ఉంది. ఆయనతో పనిచేయటంతో చాలా విషయాలు నేర్చుకున్నాను.అంతెందుకు నాకు హిందీ కూడా సరిగ్గా రాదు. ప్రతీదానికి ఆయన మీదే ఆధారపడ్డాను. అసలు అమీర్ ఖాన్ అనే వ్యక్తి లేకపోతే హిందీ గజనీని ఊహించటం కష్టం. అందుకే ఆయన కెరీర్ కి కన్సల్ టెంట్ గా ఉండమని అడుగుదామనుకుంటున్నాను...అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఆయన.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X