రోడ్లపై పీకే హడావిడీ..ఫ్యాన్స్ హంగామా
చేతిలో రేడియో పుచ్చుకుని రోడ్డు మీద పరిగెడుతున్న అమీర్‌ఖాన్‌ని కొంతమంది వెంటాడుతుండగా ఆయన వారిని తప్పుదోవ పట్టించి ఎదురుగా వస్తున్న డీటీసీ బస్సు ఎక్కిన దృశ్యాన్ని బుధవారం ఇక్కడ చిత్రీకరించారు. సినిమాలో హీరోయిన్ గా అనుష్క శర్మ నటిస్తున్నారు.
'పీకే' సినిమా విషయానికొస్త.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. 2014లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే అమీర్ ఖాన్ బాలీవుడ్ సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన కిస్సింగ్ సీన్లో నటించి రికార్డు సృష్టించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మతో కలిసి అమీర్ ఖాన్ ఈ ముద్దు సీన్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్, అనుష్క వర్మ కలిసి 'పికే'(Peekay) అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరి మధ్య జరిగే ఓ రొమాంటిక్ సన్నివేశంలో ఈ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. వయసులో తనకంటే సగం వయసు ఉన్న అనుష్క శర్మతో అమీర్ ఖాన్ ఈ లాంగెస్ట్ కిస్సింగ్ సీన్లో నటించడం చర్చనీయాంశం అయింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ నిడివి ఉన్న ముద్దు సీన్ ఇదే అని అంటున్నారు.


Click it and Unblock the Notifications












