»   » 'దంగల్'లో అమీర్ ఖాన్ కూతుళ్లు వీళ్లే: 21 వేల మందిలో వీరికి చాన్స్

'దంగల్'లో అమీర్ ఖాన్ కూతుళ్లు వీళ్లే: 21 వేల మందిలో వీరికి చాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతుళ్ల పాత్రల కోసం వేట చివరకు కొలిక్కి వచ్చింది. తాను ఈ చిత్రంలో నటిస్తానని కంగనా రౌత్ ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని తేలిపోయింది.

ఆ పాత్రలకు ఫిల్మ్ మేకర్స్ కొత్తవాళ్లను తీసుకోవాలని అనుకున్నారు. ఇందుకు గాను, వారు 21 వేల మందికి ఆడిషనింగ్ నిర్వహించినట్లు సమాచారం. చివరకు ఇద్దరిని ఎంపిక చేశారని చెబుతున్నారు. వారిలో ఒక యువతి ఫాతిమా సానా షేక్ కాగా రెండో యువతి సాన్యా మల్హోత్రా.

Aamir Khan's daughters in 'Dangal' finally revealed!

ఫాతిమా ముంబైకి చెందిన అమ్మాయి. ముంబైకి చెందిన నాట్యకళ అకాడమీ డ్యాన్స్ వర్క్స్‌లో ఆమె డ్యాన్సర్. కాగా, సాన్యా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమె బ్యాలేలో శిక్షణ పొందింది.

సాన్యా పలు యాడ్స్‌లో ఇంతకు ముందు నటించింది. దంగల్ సినిమాను రెజ్లర్ మహవీర్ సింగ్, ఆయన కూతుళ్లు గీత, బబితా ఫోగత్‌ల జీవితాల ఆధారంగా నిర్మిస్తున్నారు. 

Read more about: aamir khan, dangal, bollywood
English summary
The hunt for Aamir Khan’s daughters in his upcoming film ‘Dangal’ is finally over. There were numerous reports stating Kangana Ranaut had been approached to play the role; however that turned out to be false.
Please Wait while comments are loading...