అమీర్ ఖాన్ ‘పి.కె’: అప్పుడు న్యూడ్, ఇపుడు ఇలా (ఫోటో)
హైదరాబాద్: అమీర్ ఖాన్ తాజా సినిమా 'పి.కె'కు సంబంధించి ఇటీవల విడుదలైన న్యూడ్ లుక్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కేసు కూడా బుక్ అయింది. దీనిపై అమీర్ ఖాన్ మాట్లాడుతూ...తాను పబ్లిసిటీ కోసం అలా చేయలేదని, సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని తెలిపారు. ఆగస్టు 20న విడుదలయ్యే పోస్టర్లో రేడియో కూడా అడ్డం ఉండదని చెప్పిన అమీర్ కాన్...ఈ సారి నిండుగా బట్టలేసుకుని దర్శనమిచ్చాడు.

రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
పిటీషన్ కొట్టి వేత..
అమీర్‌ఖాన్ నటించిన ''పి.కె'' సినిమాపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 'పి.కె' సినిమాలో నగ్నత్వం ప్రదర్శించారని అమీర్‌ఖాన్, దర్శకుడిపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం కళలు, వినోదానికి సంబంధించిన విషయాలపై జోక్యం అవసరంలేదని పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్ధానం పిటీషనర్ కి సలహా ఇచ్చింది. అంతేకాకుండా ఇటువంటి విషయాలలో,మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీ కోర్టు పిటీషనర్ కి సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది.


Click it and Unblock the Notifications











