»   »  అమీర్ ఖాన్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఖరారైంది!

అమీర్ ఖాన్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఖరారైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో అటు ప్రపంచం దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. మరో వైపు అమీర్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ ‘ఎకె ఫిల్మ్స్' కూడా పర్‌ఫెక్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మిస్తూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా మ్యాజిక్ చేస్తోంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... కొత్త రచయిత అదితి రావు ఇటీవల అమీర్ ఖాన్ ను సంప్రదించిందని, అమీర్ ఖాన్ కోసం స్క్రిప్టు సిద్ధం చేసిందని, అమీర్ ఖాన్ కు ఎంతో నచ్చడంతో చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాను ‘బర్ఫ్' అనే టైటిల్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Aamir Khan’s next film gets title?

అయితే ఈ సినిమా విషయమై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా కోసం పర్ ఫెక్ట్ నటీనటులు, టెక్నీషియన్లు ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. వారి ఎంపిక పూర్తయిన తర్వాత సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాబోతోంది.

మరో వైపు అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇండియాలో మాత్రమే కాదు... ఈ చిత్రం విదేశాల్లోనూ కలెక్షన్లు అదరగొడుతోంది. విడుదలైన ప్రతి చోటా ఈ చిత్రం కలెక్షన్లు భారీగా రాబడుతోంది.
.

English summary
According to latest update it is heard that, Aamir was approached by new writer Aditi Rao and she has prepared a new script for Aamir and from the close sources it was also heard that, PK actor liked the script and the title for this film was assumed to be as, ‘Barf’
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu