హీరోగారి నగ్న అవతారం, మహిళలు ఛీ కొడుతున్నారు!
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పి.కె' న్యూడ్ పోస్టర్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పోస్టర్ అసభ్యంగా ఉందని ఓ లాయర్ కేసు నమోదు కాగా....తాజాగా మహిళలు రంగంలోకి దిగారు. ఈ నగ్న పోస్టర్ చూసి ఛీ కొడుతున్నారు. ఈ పోస్టర్ గురించి పోలీసులకు కొందరు ఫిర్యాదు చేసారు.
ఇలాంటి అసభ్య పోస్టర్లను పబ్లిక్ ప్రదేశాల్లో ప్రదర్శించడానికి వీల్లేదని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఆగ్రహంతో...ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్ వద్ద అమీర్ ఖాన్ న్యూడ్ పోస్టర్ తొలగించారు. ఈ విషయాన్ని థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కూడా ద్రువీకరించారు. మహిళల ఫిర్యాదు తర్వాత పోలీసులు వచ్చి చెప్పడంతో తొలగించినట్లు ఆయన తెలిపారు.

అమీర్ ఖాన్ తాజా సినిమా 'పీకె' ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్లో అమీర్ ఖాన్...న్యూడ్‌గా దర్శనమివ్వడం అందరినీ షాక్‌కు గురి చేసింది. జననాంగాలు కనిపించకుండా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకోవడం తప్ప అతని ఒంటిపై నూలు పోగు కూడా లేదు.
రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











