అమీర్ ఖాన్ న్యూడ్ పోస్టర్లపై జోకులే జోకులు (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం 'పీకే' అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. రేడియో అడ్డం తప్ప ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా కనిపించి అమీర్ ఖాన్ అందరినీ ఆశ్చర్యంలో పడేసారు. నగ్నంగా నటిస్తున్నాడు అమీర్ ఖాన్ అంటే ఏమిటో అనుకున్నవారు సైతం ఈ ఫస్ట్ లుక్ చూసాక షాక్ అయ్యారు. క్రిస్మస్ కానుకగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ లు నటిస్తున్నారు.
రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కాంబినేషన్ లో '3 ఇడియెట్స్' తర్వాత 'పీకే' చిత్రం రూపొందుతోంది. డిస్నీ ఇండియా, విధూ వినోద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 19 విడుదల చేయనున్నట్టు అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కాగా 'పీకే' పోస్టర్లపై ట్విట్టర్,ఇతర సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

ట్వీట్ 1
అమీర్ ఖాన్ ‘పీకే' పోస్టర్లపై ఇదో బెస్ట్ జోక్. ఆడియో ప్లేయర్లతో ఇలా పోల్చారు.

ట్వీట్ 2
సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ ‘పీకే'పై రకరకాల పేరడీలు చేస్తున్నారు.

ట్వీట్ 3
సెన్సార్డ్ అంటూ....సెన్సార్ స్టాంప్ వేసినట్లు ఇలా ఫన్నీ ఫోటోలు ‘పీకే'పై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ట్వీట్ 4
అమీర్ ఖాన్ న్యూడ్ ఫోజులను....హాట్ మోడల్ పూనమ్ పాండేతో పోలుస్తూ జోకులు పేలుస్తున్నారు.

ట్వీట్ 5
గతంలో పూనం పాండే ఇండియా కోసం బట్టలిప్పుతానంది....ఇపుడు అమీర్ ఖాన్ పీకే కోసం అంటూ ట్వీట్


Click it and Unblock the Notifications











