కెమెరాకు చిక్కిన అమీర్ ఖాన్ కొడుకు
ముంబై : బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, భార్య కిరణ్ రావు ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కిరణ్ రావుకు గతంలో గర్భ స్రావం కావడంతో వైద్యుల సలహా మేరకు అద్దెగర్భం(వేరొక మహిళ గర్భంలో వీరి బిడ్డను పెంచడం) ద్వారా డిసెంబర్ 1, 2011న వారసున్ని కన్నారు ఈ స్టార్ కపుల్. తమ ముద్దుల తనయుడికి'ఆజాద్ రావు ఖాన్' అని పేరు పెట్టారు.
ఇప్పటి వరకు ఆజాద్ రావ్ ఖాన్ ఫేస్ ఫోటో కెమెరాకు చిక్కలేదు. అమీర్ కూడా ఎన్నడూ తన కుమారుడిని మీడియా ముందుకు తీసుకురాలేదు, ఫోటోలు కూడా విడుదల చేయలేదు. తాజాగా ధూమ్ 3 షూటింగ్ సందర్భంగా భార్య కిరణ్ రావు, కొడుకు ఆజాద్ రావ్ ఖాన్‌తో చికాగో వెళ్లారు. ఈసందర్భంగా అమీర్ కొడుకు ఆజాద్ రావు ఫోటోగ్రాఫర్ల కెమెరాకు చిక్కాడు.
కిరణ్ రావ్‍ని కులాంతర వివాహం చేసుకున్న అమీర్ ఖాన్ తన కొడుకుకి వెరైటీగా ఆజాద్ రావ్ ఖాన్ అని పేరు పెట్టాడు. ఈ పేరులోని అర్థాన్ని గతంలో అమీర్ వెల్లడిస్తూ...ఆజాద్ అంటే స్వాతంత్రం. ఇది మా గ్రేట్ గ్రాండ్ అంకుల్ మౌలానా ఆజాద్ పేరు. ఆయన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు. మేమంతా ఆయన కుటుంబ సభ్యలవ్వడం ఇప్పటికీ గర్వంగా పీలవుతున్నాం.... మా వాడికి ఆయన పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ పేరు ఎంపిక చేసింది నా ముద్దుల పెళ్లామే' అని చెప్పుకొచ్చారు.
ఇక అమీర్ నటిస్తున్న ధూమ్ 3 వివరాల్లోకి వస్తే...ఈ చిత్రానికి విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ బేనర్‌పై ఆదిత్య చోప్రా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా ముఖ్య తారాగణం. ప్రీతమ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2013లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారిగా ధూమ్ 3 ఐమాక్స్ థియేటర్లలో ప్రదర్శితం కాబోతోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఐమాక్స్ తెరలపై ప్రదర్శించ బడలేదు.


Click it and Unblock the Notifications












