ఫోటోలు: అమీర్ ఖాన్ తనయుడి తెరంగేట్రం
ముంబై: ప్రముఖ నటుల కుమారులు సినిమాల్లో ప్రవేశించి ఏదో మేరకు ఊపేస్తూనే ఉన్నారు. రణబీర్ కపూర్, అభిషేక్ బచ్చన్, రితిక్ రోషన్ వంటివారు సినిమాల్లో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వారి సరసన అమీర్ ఖాన్ కుమారుడు చేరబోతున్నాడు. బాలీవుడ్‌లో ప్రవేశానికి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ప్రత్యేకంగా ఫిట్నేస్ శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.
జునైద్ ఖాన్‌కు దర్శకత్వంపై మక్కువ ఎక్కువ అని, అందులో తన ప్రతిభను చాటడానికి చూస్తున్నాడని ఇంతకు ముందు వార్తలు వచ్చాయి. పి.కె. రూమర్‌లో అతను ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి సహాయకుడిగా పనిచేస్తున్నాడని చెబుతున్నారు. ఇప్పుడు అతను నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. గత ఏడు నెలలుగా అతను ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం.
సమీర్ జౌరా (శిక్షకుడు) నెంబర్‌ను అమీర్ ఖాన్ ఫర్ఙాన్‌ను అడిగాడని, జునైద్ ఆయనను కలిశాడని, తాను శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడని, అయితే జునైద్ ఫిట్‌గా ఉన్నాడని ఆయన తేల్చాడని అంటున్నారు. అమీర్ ఖాన్ నుంచి కూడా జునైద్ కొన్ని పాఠాలు నేర్చుకునే అవకాశాలు లేకపోలేదు.

అమీర్ - జునైద్
3 ఇడియట్స్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలో అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్‌తో ఇలా ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. అమీర్ ఖాన్ బాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసిన విషయం తెలిసిందే.

సల్మాన్, జునైద్, రాణీ
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సినీ నటి రాణీ ముఖర్జీతో కలిసి ఉన్నప్పుడు ఫొటోగ్రాఫర్లు క్లిక్ చేశారు.

చిన్నప్పటి చిత్రం
తండ్రి అమీర్ ఖాన్, తల్లి రీనాలతో కలిసి చిన్నప్పుడు జునైద్ ఖాన్ ఇలా... అమీర్ ఖాన్ హిందీ సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు.

అమీర్, కిరణ్, జునైద్
తండ్రి అమీర్ ఖాన్, సవతి తల్లి కిరణ్ రావులతో కలిసి జునైద్ ఖాన్ ఇలా... అమీర్ ఖాన్ కిరణ్ రావును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

జునైద్ ఖాన్ ఇలా..
సోనం వర్మతో కలిసి జునైద్ ఖాన్ ఇలా ఫొటోలకు చిక్కాడు. సోనం వర్మ జునైద్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం ఉంది.

త్వరలోనే జునైద్ నటనలోకి..
అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ త్వరలోనే హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడిని ఎలా అమీర్ ఖాన్ సినిమాల్లోకి ప్రవేశపెడుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











