'సత్యమేవ జయతే' అంటున్న అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ త్వరలో బుల్లితెరపై హల్‌చల్ చేయటానికి ప్రిపేరవుతున్నాడు. 'సత్యమేవ జయతే' పేరుతో రూపొందుతున్నఈ టెలివిజన్ రియాల్టీ షోలో అమీర్‌ఖాన్ కన్పించబోతున్నాడు. సినిమాల్లో ప్రతి విషయంలోనూ 'మిస్టర్ పరఫెక్ట్'గా ఉండే అమీర్‌ఖాన్, బుల్లితెరపైనా తనదైన హవా చాటుకుంటాడనే అని అందరూ అంటున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన 'సత్యమేవ జయతే' ప్రోమో మీడియాలో దుమ్మురేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రోమోకి మంచి స్పందన వస్తోంది.
స్టార్‌ప్లస్ ప్రసారం చేయనున్న సత్యమేవ జయతే రియాల్టీ షో, దూరదర్శన్‌లోనూ వీక్షించవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ...ఇలా పలు భాషల్లోకి 'సత్యమేవ జయతే' కార్యక్రమం డబ్బింగ్ అవుతోంది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే రియాల్టీ షో అని, జనంలో వ్యవస్థ పట్ల అవగాహన పెంచేలా, వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపేలా ఈ రియాల్టీ షో వుంటుందని అమీర్‌ఖాన్ చెబుతున్నాడు.
మరో ప్రక్క భాక్సాఫీస్ బాధ్షా షారూఖ్ ఖాన్ రికార్డుని అమీర్ ఖాన్ బ్రద్దలు కొట్టారు. ఆయన తాజా చిత్రం 'తలాష్'కి సంబంధించిన థియేరిటికల్ రైట్స్ ని రిలయన్స్ సంస్థ 90కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. గతంలో షారూక్‌ఖాన్ 'డాన్2' చిత్రానికి ఇవే థియేరిటికల్ రైట్స్ క్రింద 80 కోట్లు లభించాయి. దాంతో ఇప్పుడు ఆ రికార్డుని చెరిపేసి కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్లైంది. ఇక గత కొంత కాలంగా బాలీవుడ్ ట్రేడ్ రికార్డ్‌ల విషయంలో షారూక్, అమీర్‌లు పోటాపోటీగా తలపడుతున్నారు.
'త్రీ ఇడియట్స్'తో ఆల్‌టైమ్ బాలీవుడ్ కలెక్షన్స్ రికార్డు సాధించి కొత్త రికార్డుని క్రియేట్ చేసారు అమీర్. అయితే 'డాన్ 2' చిత్రంతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు షారూక్. తాజాగా 'తలాష్' చిత్ర హక్కుల రికార్డుతో అమీర్‌ఖాన్ బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌ను అధిగమించి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరిచారు. కరీనాకపూర్, రాణిముఖర్జీ హీరోయిన్స్ గా చేస్తున్న 'తలాష్' త్వరలో నవంబర్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











