అన్నా హజారేకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మద్దతు

By Pratap

జన్ లోక్‌పాల్ బిల్లుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరాహార దీక్షకు దిగిన సామాజిక కార్యకర్త అన్నా హజారేకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన అన్నా హజారేకు ఓ లేఖ రాశారు. క్రికెట్ జట్టు విజయానికి ఇచ్చిన ఎక్కువ మద్దతు అన్నా హజారేకు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. అవినీతిని అరికట్టడానికి ప్రతిపాదించే లోక్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీలో సామాజిక కార్యకర్తలను భాగస్వాములను చేయాలని కోరుతూ అన్నా హజారే దీక్షను ప్రారంభించారు.

అన్నా హజారే దేశ యువతకు స్ఫూర్తి అని అమీర్ ఖాన్ అన్నారు. హజారే విజ్ఞప్తిని గౌరవించాలని తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. అన్నా హజారే చేస్తున్న డిమాండులో అర్థం ఉందని తనకు అనిపించిందని ఆయన ప్రధానికి రాసిన లేఖలో అన్నారు. దేశంలోని అవినీతికి బాధపడుతున్న కోట్లాది భారత ప్రజల్లో తాను ఒక్కడినని ఆయన అన్నారు. అవినీతిని అరికట్టడానికి కఠినమైన చర్యలు అవసరమని ఆయన అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X