For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సచిన్ టెన్షన్ పడ్డాడు.. గోళ్లు కొరుకుతూ ఆందోళన.. అవుట్ అని అరిచి.. అమీర్‌ఖాన్ ఆసక్తికరమైన ట్వీట్

  By Rajababu
  |

  బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందించిన లగాన్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాను చూస్తూ సచిన్ టెండూల్కర్ ఎంత ఆందోళనకు గురయ్యాడో అనే ఆసక్తికరమైన విషయాన్ని తాజాగా అమీర్ ఖాన్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. మే 26వ తేదీన సచిన్ జీవితం ఆధారంగా రూపొందిన సచిన్ః ఏ బిలియన్ డ్రీమ్స్ అనే చిత్రం విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ మాస్టర్ బ్లాస్టర్‌కు సంబంధించిన సరదా సన్నివేశాన్నినెటిజన్లు, అభిమానులతో పంచుకోవడం గమనార్హం.

  వీడియోలో ఏమున్నందంటే

  సచిన్ అంటే నాకు చాలా ఇష్టం. సచిన్ ఆడుతుండే టీవీలో చూడటం, స్టేడియంకు వెళ్లి చీర్ చేసేవాడ్ని. సచిన్ బాగా ఆడితే స్టేడియంలో ఎగిరి గంతేసిన సంఘటనలు ఉన్నాయి. సచిన్‌కు అంతటి అభిమానిని. అలాంటి వ్యక్తి నా సినిమా చూసి అవుట్ అవుట్ అని అరవడం నా జీవితంలో మరిచిపోలేనటువంటి విషయం. ఎప్పుడూ ఆ సంఘటన నా కళ్ల ముందు కదలాడుతుంటుంది. మరోకొద్ది రోజుల్లో విడుదలవుతున్న సచిన్ సినిమా చూడటానికి ఉత్సాహంగా ఉన్నాను. సచిన్ సినిమా విజయం సాధించాలి అని కోరుకొంటున్నాను అని అమీర్ వీడియోలో తెలిపాడు.

  లగాన్ ప్రీమియర్‌లో..

  లగాన్ ప్రీమియర్‌లో..

  సినీ, క్రికెట్ ప్రముఖుల కోసం 2001లో లగాన్ చిత్రాన్ని అమీర్‌ఖాన్ ముంబైలోని రాజ్ కమల్ స్టూడియోలో ప్రదర్శించాను. ఆ ప్రీమియర్ షోకు సచిన్‌తోపాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. థియేటర్‌ వెనక క్యాబిన్‌లోని కిటీకి నుంచి అందరి స్పందన చూస్తున్నాను. అందరి కంటే సచిన్ ఎక్కువ టెన్షన్ పడ్డారు. ఉద్వేగానికి లోనయ్యారు అని అమీర్ ఖాన్ తెలిపారు.

  సచిన్‌లో టెన్షన్..

  సచిన్‌లో టెన్షన్..

  నేను వెనుక నుంచి గమనిస్తూ ఉన్నాను. బ్రిటీష్ వాళ్ల వికెట్ అసలు పడటం లేదు. దాంతో సచిన్ మనసులో టెన్షన్ మొదలైంది. తెరమీద మ్యాచ్ ఆసక్తికరంగా మారడంతో ఉద్వేగానికి లోనై చేతి గోళ్లను కొరికేస్తూ కనిపించాడు. అది చూసి నాకు చాలా ముచ్చటేసింది అని అమీర్ వెల్లడించాడు.

  సంతోషం పట్టలేక..

  సంతోషం పట్టలేక..

  అలా సచిన్ చాలా ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో బ్రిటీష్ వాళ్ల వికెట్‌ పడింది. ఆ సంతోషాన్ని పట్టలేక సచిన్ టెండూల్కర్ తన సీట్లో నుంచి లేచి ‘అవుట్', ‘అవుట్' అంటూ అరవడం ప్రారంభించాడు. ఆ సంఘటన చూసి నేను చాలా సంతోషపడ్డాను అని అమీర్ అప్పటి జ్క్షాపకాన్ని తాజాగా నెమరువేసుకొన్నారు.

  26న సచిన్ సినిమా..

  26న సచిన్ సినిమా..

  సచిన్‌పైనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులపై ప్రభావం చూపించిన లగాన్ చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. భారత దేశానికి స్వాతంత్రం రాకపూర్వం బ్రిటీష్ అధికారులకు, ఓ గ్రామస్తులకు జరిగిన క్రికెట్ పోటీ ఆధారంగా లగాన్ తెరకెక్కింది. ఈ చిత్రం 74వ అస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా క్రికెట్ నేపథ్యంగా సచిన్ జీవిత కథ ఆధారంగా సచిన్ః ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమాను జేమ్స్ ఎర్సికైన్ తెరకెక్కించాడు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.

  English summary
  Ahead of the release of Sachin: A Billion Dreams, Aamir Khan took to Twitter to share a funny incident involving Sachin Tendulkar. In 2001, Sachin Tendulkar was at a private screening of Lagaan in Mumbai's Rajkamal studio, Aamir began, and the Master Blaster was nervous as the climactic cricket match begin. The Britishers were not losing any wicket and Sachin, Aamir saw from behind a window in the studio, was nervously biting his nails looking at the screen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X