షాకింగ్ : న్యూడ్‌గా కనిపించబోతున్న స్టార్ హీరో
ముంబై: సినిమాల్లోని పాత్రలకు తగిన విధంగా మారిపోవడం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్టైల్. ఆయన ఏ పాత్ర పోషించిన పర్‌ఫెక్టుగా ఉంటుంది కాబట్టే ఆయన్ను అంతా మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటుంటారు. సినిమాలో తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడటానికైనా....ఎంతకు తెగించడానికైనా వెనకాడని కమిట్మెంట్ ఉన్న నటుడు.
తాజాగా అమీర్ ఖాన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారు. తన తర్వాత బాలీవుడ్ సినిమా 'Peekey' చిత్రంలో పాత్రకు న్యాయం చేయడం కోసం షాకింగ్ అవతారం ఎత్తబోతున్నారు. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రంలో అమీర్ ఖాన్ పూర్తి నగ్నంగా కనిపిచంబోతున్నారని తెలుస్తోంది. తొలుత ఈ సీన్ చేయడానికి అమీర్ ఖాన్ కాస్త వెనక ముందు ఆలోచించినా......ఆ సీన్ సినిమాకు ఎంత అవసరమే చెప్పడంతో చేయడానికి ఒప్పుకున్నాడట.
'పీకే' సినిమా విషయానికొస్త.... ఇదొక పొలిటికల్ సెటైర్ మూవీ. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్ ఖాన్ గగ్రా చోళీ డ్రస్ లో కనిపించనున్నాడు. ఈచిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అమీర్ ఖాన్ ఇటీవల నటించిన 'ధూమ్ 3' చిత్రం భారీ విజయం సాధించింది. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈచిత్రం ఇప్పటి వరకు రూ. 500 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి భారతీయ సినిమా వసూళ్ల రికార్డులను తిరగరాసింది. విజయకృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈచిత్రంలో కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఆదిత్య చోప్రా ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications












