అమీర్ ఖాన్ కాబోయే దేశ ప్రధాని
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న స్టార్ టీవీలో రియాల్టీ షో 'సత్యమేవ జయతే' కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను చర్చకుబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆ కార్యక్రమంలో ప్రస్తావించే సమస్యలు దేశంలో ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. ఎప్పటినుండో మనమధ్య నలుగుతున్నవే. ఎవరికివారు తమకెందుకులే అని పట్టించుకోలేదు. ఇప్పుడు వీటిని తమ కార్యక్రమంద్వారా ప్రసారం చేసి ప్రజలను, నాయకులను ఆ దిశగా ఆలోచింపజేయడంలో అమీర్ ఖాన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
టివిని కాలక్షేపానికే ఉపయోగించే మన ప్రేక్షకులు గంటన్నర సేపు కొనసాగే సీరియస్ టాపిక్స్‌ను చూస్తారా అని మొదట సందేహం కలిగింది. కాని అమీర్‌ఖాన్‌కున్న ఆకర్షణ, కార్యక్రమ రూపకల్పన, ప్రెజెంటేషన్ ఆసక్తికరంగా వుండటంవల్ల ప్రేక్షకులు అందులో లీనమైపోతున్నారు...స్టార్ ఇమేజ్, డబ్బు సంపాదన కోసమే తప్ప మంచి పనులు చేయడానికి ఆసక్తి చూపని ఈ తరం స్టార్లకు అమీర్ ఖాన్ ఆదర్శనీయం.


Click it and Unblock the Notifications












