Don't Miss!
- News కేజ్రివాల్, కవిత కస్టడీపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం..!
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'1.. నేనొక్కడినే' రీమేక్ పై నిర్మాత, దర్శకుడు
హైదరాబాద్ : బాలీవుడ్ మిస్టర్పెర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ 1, నేనొక్కడినే రీమేక్ చేస్తారా? అన్న ప్రశ్నకు 14రీల్స్ అధినేత రామ్ ఆచంట ఓ క్లారిటీనిచ్చారు. వాస్తవానికి వన్ సినిమాకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఎంతో ప్యాషన్‌తో తీసిన ఈ సినిమాకి సముచిత గౌరవమే దక్కింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో పాటు అన్నిచోట్లా ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాగా గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న ప్రఖ్యాత సినిమా వెబ్సైట్ ఐఎండీబీలో 9.5 రేటింగు ఇచ్చి తెలుగు సినిమాని గుర్తించారంటే అది ఆషామాషీ విషయం కాదు.
అమీర్‌ఖాన్‌కి ఈ సమాచారం అందే ఉంటుంది. బాలీవుడ్ మీడియాకి ఈపాటికే ఈ విషయం అందేసింది. కాబట్టి మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఈ సినిమాపై ఆసక్తిగానే ఉన్నారని భావిస్తున్నాం. ప్రస్తుతానికి అనవసర ప్రచారం అవసరం లేదనే ఈ విషయంపై ఎక్కువ మాట్లాడడం లేదు. ప్రాసెస్ మాత్రం నడుస్తుంది.. అని చెప్పారు. అమీర్‌ఖాన్‌తో రీమేక్ అవకాశం వస్తే దర్శకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు..అమీర్ అంతటివాడితో ఛాన్స్ అంటే ఎవరు వదులుకుంటారు? అని దర్శకుడు సుకుమార్ అన్నారు.
అలాగే...అమీర్‌ఖాన్ ఈ సినిమా చేస్తున్నాడనే విషయంపై నేనేం చెప్పినా ఎక్కువ చెప్పినట్లవుతుంది. అమీర్ అంతటివాడు చేస్తానంటే ఎవరికైనా ఆనందమే. అది ప్రాసెస్‌లో ఉంది. దాని గురించి ఏం చెప్పినా 'వీళ్లు ఎక్కువ చేస్తున్నారు. ఇదేదో పబ్లిసిటీ స్టంట్లాగుంది' అంటారు. అందుకే దాని సంగతి అలా వదిలేద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం అని సుకుమార్ వివరించారు.