అమీర్ ఖాన్ నాది కాపీ కొట్టారంటూ ఐటం గర్ల్
బాలీవుడ్ ఐటం బాంబ్ రాఖీ సావంత్ ఎప్పుడూ ఏదో వివాదంలో ఉంటూ ప్రపంచం దృష్టిని తనవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా అమీర్ ఖన్ పాపులర్ షో సత్యమేవ జయితే మీద రాళ్లు విసిరే ప్రయత్నం చేసింది. తన రాఖి కా ఇన్సాఫ్ అనే షో కాన్సెప్ట్ ని కాపీ కొట్టి అమీర్ ఖాన్ ఆ పోగ్రాం రూపొందించి విజయం సాధించారని ఆరోపించింది. ఈ విషయమై ఆమె మీడియా వద్ద మండిపడుతూ అమీర్ ఖాన్ ని ఆడిపోసుకుంది.
ఆమె మీడియాతో మాట్లాడుతూ... మీరు సత్యమేవ జయితే పోగ్రాం ని జాగ్రత్తగా చూస్తే నా రాఖీ కా ఇన్సాఫ్ పోగ్రాం తప్పక గుర్తుకు వస్తుంది. ఆ షో నా షోకి పక్కా కాపీ అని చెప్పటానికి నేను వెనకాడను. ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నా కాన్సెప్ట్ ని దొంగిలించారు. రెండు ఫార్మెట్ లు ఒకటే. నేను ఆ షో లో రకరకాల జనాల్ని కలిసి వారి సమస్యలు వింటూ చర్చిస్తాను...పరిష్కారాలు చూపించేందుకు ప్రయత్నిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగ ఆలోచింపచేస్తాను. ఇప్పుడు సత్యమేవ జయితే లో జరుగుతోంది అదే అంది.
అయితే నేను వారివన్నీ విని డిస్ట్రబ్ అయ్యి డిప్రషన్ తో భాధపడి హాస్పటిల్ లో చేరినప్పుడు ఆ పోగ్రాం ని రాత్రికి షిప్ట్ చేసారు. అందులోనూ నా పోగ్రాం ముఖ్యంగా మెచ్యూరిటీ కాన్సెప్ట్ తో ఉండటం వల్ల అలా చేసారు. అయితేనేం నా పోగ్రాంకి విపరీతమైన టీఆర్పీ రేటింగ్ లు వచ్చాయి. అయితే సత్యమేవ జయితే విషయానికి వస్తే అది నడుపుతున్నది అమీర్ ఖాన్. ఆయనకున్న విపరీతమైన ఫాలోయింగ్ ని బట్టి ఆ పోగ్రాంని ఉదయం పూట అందరూ చూసే వేళల్లో వేస్తున్నారు. ఇవన్నీ అంటున్నానని నేను అమీర్ ఖన్ కి వ్యతిరేకిని కాదు అంది.
అమీర్ ఖాన్ నా దృష్టిలో ఓ గ్రేట్ పర్శన్. అతను నా పరిస్ధితి బాగోని సమయంలో నాకు అండగా ఉండి ధైర్యం చెప్పారు. అయితే నిజానికి నేను ఈ విషయానికి ఎత్తటానకి కారణం..నా పోగ్రాంని కాపీ కొట్టారని కాదు..రాఖీ సావంత్ ఈ పోగ్రాం చేసిందంటే బిజినెస్ కోసమో,టీఆర్పీ ల కోసమో చేసిందంటారు. అదే అమీర్ ఖాన్ చేసాడంటే జనాల కోసం,సోషల్ వర్క్ అంటారు. అలాగే నేను పోగ్రాం చేసినప్పుడు కోర్టులు కూడా కలగచేసుకుని,నువ్వు ఎవరు ..జనాల సమస్యలు సాల్వ్ చేయటానికి అని ప్రస్నించాయి. అలాగే అమీర్ ఖాన్ కి ఈ పోగ్రాం కి ఎపిసోడ్ కు మూడు కోట్లు ముడతాయి. నాకు ఐదు లక్షలు వచ్చాయి. మరి నేను పోగ్రాం చేయాటనికి,ఆయన చేయటానికి తేడా ఏమిటో నాకు అర్దం కాదు ఇప్పటికీ అంది.


Click it and Unblock the Notifications











