అబ్బురపరిచేలా: అమీర్ ఖాన్...కుస్తీ ప్రాక్టీస్ (వీడియో)

By Srikanya

ముంబై : నటనకు,కష్టపడటానికి వయస్సు అడ్డం కాదని ప్రూవ్ చేస్తున్నాడు అమీర్ ఖాన్. తాజాగా ఆయన తన 50 ఏళ్ల వయస్సులో ..రెజ్లింగ్‌లో ఎంతో క్లిష్టమైన ధోబీ పచడ్‌ అనే టెక్నిక్‌ నేర్చుకోవడానికి ఆమీర్‌ కఠోర సాధన చేశాడు. కేవలం పది రోజుల్లోనే దాన్ని ఒంటబట్టించుకున్నాడట.

Aamir Khan tries a dhobi pachad

ఆమీర్‌ ఆ టెక్నిక్‌ను ప్రదర్శిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ టెక్నిక్‌తో ఆమీర్‌ తన ప్రత్యర్థులను ఎలా ఓడిస్తాడో 'దంగల్‌'లో చూడాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి..అమీర్ ఖాన్ కష్టం అర్దమవుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదటి నుంచీ ...తెరపై ఏ పాత్ర వేసినా దానికి పూర్తి న్యాయం చేసేందుకు ఆమీర్‌ ఖాన్‌ పడే తపన అంతా ఇంతా కాదు. అందుకే ఆయన్ను మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని పిలుస్తుంటారు. ప్రస్తుతం ఆయన 'దంగల్‌'తో బిజీగా ఉన్నాడు. రెజ్లింగ్‌ క్రీడాకారుడు మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది.

తెరపై నిజమైన రెజ్లర్‌లా కనిపించేందుకు ఆమీర్‌ ఎంతో కసరత్తు చేస్తున్నాడు. శారీరక దృఢత్వం కోసం 50 ఏళ్ల వయసులోనూ భారీగా బరువు పెరిగి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు రెజ్లింగ్‌ మెలకువలపై దృష్టిపెట్టాడు.

Watch Aamir Khan practice dhobi pachad for his role in Dangal!నటనలో జీవించడం...కష్టపడటం అంటే ఇదే...

Posted by Suryaprakash Josyula on 31 May 2015

'పీకే' తర్వాత ఆమీర్‌ ఖాన్‌ నటించే చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. తన కొత్త చిత్రం 'దంగల్‌' కోసం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ అనే మల్లయోధుడిగా కనిపిస్తాడు ఆమీర్‌. ఈ పాత్ర కోసం బరువు పెరుగుతున్నాడు. 'మన ఆమీరేనా' అని ఆశ్చర్యపోయేలా తయారైంది ఆమీర్‌ దేహం.

దీని గురించి ఆమీర్‌ చెబుతూ ''దంగల్‌'లో నా పాత్ర కోసం బరువు పెరిగాను. ఇప్పుడు 95 కిలోలున్నాను. ఇంత బరువు పెరగడం అమ్మకు, నా భార్యకు నచ్చడం లేదు. నా ఆరోగ్యంతో ఆటలాడుతున్నానని భయపడుతున్నారు. నాకూ అదే భయం ఉందనుకోండి. ఈ శరీరంతో వంగొని బూట్ల తాళ్లు కట్టుకుందామన్నా ఆయాసం వచ్చేస్తోంద''న్నారు.

'దంగల్‌' గురించి చెబుతూ ''ఈ సినిమాలో ఇద్దరు అథ్లెట్లకు తండ్రిగా కనిపిస్తాను. వయసు భేదం చూపించడానికి బరువు పెరగాల్సి వచ్చింది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. డిసెంబరుకల్లా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేస్తాం. ఆ తర్వాత ఐదు నెలలపాటు బరువు తగ్గి మళ్లీ యువకుడిలా కనిపిస్తాను. జూన్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. చిత్రీకరణ ఆఖరికొ చ్చేసరికి 'పీకే'లో ఆమీర్‌ ఖాన్‌లా కనిపిస్తాన''ని చెప్పాడు ఆమీర్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X