ఇంత తక్కువ రెమ్యూనరేషనా? తప్పుకున్న హీరో!
ముంబై: బాలీవుడ్ టాప్ 5 అగ్రహీరోల్లో ఒకరు మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. చాలా కాలంగా అమీర్ ఖాన్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగిన కథ, దర్శకుల కోసం ఎదరు చూస్తున్నాడు. ఇటీవల నిత్యా మెహ్రా అనే కొత్త దర్శకుడు ఇందుకు సంబంధించిన వివరాలతో అమీర్ ఖాన్ దగ్గరికి వచ్చాడు.
నిత్యా మెహ్రా చెప్పిన కథ, కథనం, స్ర్రిప్టు అమీర్ ఖాన్‌కు బాగా నచ్చింది, అయితే....ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నిర్మాతలు అమీర్ ఖాన్‌కు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో నటించడానికి నో చెప్పాడట. గెస్ట్ రోల్‌కు ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే వారు ఆఫర్ చేయడంతో అమీర్ ఖాన్ అసంతృప్తితో నో చెప్పాడని టాక్.

రెమ్యూనరేషన్ దగ్గర వచ్చిన విబేధాలతో అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకోవడంతో వెంటనే....దర్శక నిర్మాతలో మరో హీరో హృతిక్ రోషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని వినికిడి. గతంలో అమీర్ ఖాన్ హీరోగా అనుకున్నపుడు దీపిక పదుకొనెను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు.
తాజాగా అమీర్ ఖాన్ ప్లేసులోకి హృతిక్ రోషన్ వస్తున్న నేపథ్యంలో హీరోయిన్ మారుతుందా? ఆమెనే తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











