హిందీ 'గజనీ'గొప్పగా రాలేదు

By Staff

Aamir Khan
అమీర్ ఖాన్ తాను హీరోగా మురగదాస్ హిందీలో రూపొందించిన గజనీ సినిమా బాగా రాలేదని చాలా అసంతృప్తిగా ఉన్నాడు. మిస్టర్ ఫెరఫెక్ట్ గా పేరుపొందిన అమీర్ తానూ ఏదైతే ప్రాజెక్టు చేస్తాడో అందులో పూర్తిగా నిమగ్నమవుతాడనే సంగతి తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్టు లోనూ అతను లీనమయ్యే చేసాడుట. అయితే మొన్న ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ వేసుకుని చూసాడు. అందులో చాలా లోపాలు కనపడ్డాయి. దాంతో మురగదాస్ ని పిలిచి చర్చించాడు.

మళ్ళీ రీషూట్ చెయ్యమని చెప్పాడు . అమీర్ ఖాన్ విశ్లేషణపై నమ్మకమున్న మురగదాస్ రీషూటింగ్ కి ప్రిపేరవుతున్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం త్రి ఈడియట్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అమీర్ కి షెడ్యూల్ గ్యాప్ లో ఈ ఫినిషింగ్ టచస్ చేయాలని ఉన్నా జుట్టు సమస్య వస్తోంది. గజనీలో చిన్న జుట్టుతో ఉన్న గుండుతో ఆయన కనపడతాడు. మళ్ళీ ఆ డిజైన్ కి వస్తే ప్రస్తుతం జర్గుతున్న షూటింగ్ కి ఇబ్బంది ఎదురౌతుందని వచ్చే నెలలో ఈ రీ షూటింగ్ పెట్టుకోమని చెప్పాడుట. అంటే రిలీజ్ కి ఇంకా బాగా లేటవుతుందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X