twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువీ ఆరోగ్యం కుదట పడేందుకు అమీర్ ప్రార్దనలు

    By Nageswara Rao
    |

    టీమిండియాకు ప్రపంచ కప్‌ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ పోరాడుతూ అమెరికాలోని బోస్టన్ క్యాన్సర్ ఇనిట్యూట్‌లో కీమోధెరపీ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ త్వరగా కోలుకోవాలని తాను దేవుడ్ని ప్రార్దిస్తున్నట్లు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తెలిపారు. అంతే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ మైదానంలోకి అతి త్వరలో యువీ అడుగు పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.

    ఈ సందర్బంలో అమీర్ ఖామ్ మాట్లాడుతూ యువీ ఓ గొప్ప ఫైటర్. యువీ పూర్తి ఆరోగ్యంతో రికవరీ అయి అతనికి ఇష్టమైన క్రికెట్ రంగంలో తిరిగి రావాలని మేమంతా ప్రార్దిస్తున్నామని.. శ్రీనగర్ ఆనందం ట్రిప్‌కు వచ్చిన సందర్బంలో అమీర్ ఖాన్ అన్నారు. ఇది ఇలా ఉంటే క్యాన్సర్‌తో బాధపడుతున్న యువరాజ్ సింగ్ మనోధైర్యాన్ని కూడగట్టుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన ఆరోగ్యం రోజు రోజుకూ మెరుగుపడుతోందని ఆయన ట్విట్టర్‌లో రాశాడు. అమెరికాలో చికిత్స పొందుతున్న యువరాజ్ సింగ్‌ క్యాన్సర్ నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అభిమానులకు యువరాజ్ సింగ్ తన పట్ల చూపిస్తున్న ఆపేక్షకు వారికి కృతజ్ఝతలు తెలిపారు.

    క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి ట్రాక్‌లోకి వచ్చిన మరో క్రీడాకారుడు ఆర్మ్‌స్ట్రాంగ్. ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కలిసి స్పూర్తి పొందాలని అనుకుంటున్నట్లు యువరాజ్ ట్విట్టర్‌లో చెప్పాడు. ఆర్మ్ స్ట్రాంగ్ యువరాజ్ ట్వీట్‌కు సమాధానం కూడా ఇచ్చాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ టెస్టుక్యులర్ క్యాన్సర్‌తో బాధపడ్డాడు. ఆర్మ్‌స్ట్రాంగ్‌కు చికిత్స చేసిన వైద్యుడే యువరాజ్ మళ్లీ చాంపియన్‌గా ముందుకు వస్తాడని హామీ ఇచ్చినట్లు ఆయన తండ్రి యోగరాజ్ ఇటీవల చెప్పాడు. తాను తిరిగి వచ్చి తన ఇండియా జెర్సీని, తన ఇండియా క్యాప్‌ను ధరించి ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని యువరాజ్ సింగ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Bollywood superstar Aamir Khan says he is praying that cricket all-rounder Yuvraj Singh, battling lung cancer, recovers and returns to the field soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X