అసిన్ కి అంతా అతనే?

అమీర్ ఖాన్ సరసన 'గజిని' చిత్రంలో, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్‌లతో 'లండన్ డ్రీమ్స్'లో నటిస్తున్న ఈమెకు తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించే సినిమాలో అవకాశం వచ్చింది. అమీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన 'తారే జమీన్ పర్' చిత్రంలో డిస్‌లెక్సియా వ్యాధితో బాధపడ్డ కుర్రాడి పాత్ర పోషించిన దర్శీల్ సఫారీ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు.
సత్యజిత్ భక్తల్ దర్శకత్వం వహిస్తున్నారు. అసలు ఈ సినిమాలో అసిన్‌కి అవకాశం రావడానికి అమీర్ ప్రధాన కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సత్యజిత్ భక్తల్‌తో తనకున్న స్నేహం వల్లే అసిన్‌ను ఇందులో నాయికగా ఎంపికయ్యేలా చేశారు అమీర్.ఇక అసిన్ 'గజిని'లో నా నటనకు మెచ్చి ఈ అవకాశం కల్పించారని చెప్తున్నారు. కాదు ఆమెతో ప్రత్యాకానుబంధమేకారణమని అంతా అంటునంటున్నారు.


Click it and Unblock the Notifications











