అక్కడ కూడా తెగ సంపాదిస్తున్న ‘పికె’
ముంబై: అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం ఇండియాలో మాత్రమే కాదు...విదేశాల్లోనూ దుమ్ము రేపుతోంది. తాజాగా ఈ చిత్రం ఆస్ట్రేలియాలో భారీగా వసూలు చేస్తున్నట్లు మార్గెట్ వర్గాలు చెబుతున్నాయి. ధూమ్-3, 3 ఇడియట్స్ చిత్రం తర్వాత ‘పికె' చిత్రం ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అక్కడి లోకల్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ మైండ్ బ్లోయింగ్ అందించిన వివరాల ప్రకారం....ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఈ చిత్రం 35 స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పటి వరకు ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘పికె' మూడో స్థానంలో ఉందని. మొదటి, రెండో స్థానాల్లో ధూమ్-3, 3 ఇడియట్స్ చిత్రాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మూడు చిత్రాలు కూడా అమీర్ ఖాన్ నటించిన చిత్రాలే కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ 4 లక్షల లోపే. పికె చిత్రాన్ని ఇప్పటి వరకు ఇక్కడ లక్ష మందికి పైగా వీక్షించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

విడుదలైన మూడువారాల్లోనే దేశీయంగా 300వందల కోట్లు, అంతర్జాతీయంగా 600కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటిన చిత్రంగా పీకే భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించిందని ముంబై ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నమోదుచేస్తున్నాయి. గజిని చిత్రంతో బాలీవుడ్‌లో తొలిసారిగా 100కోట్ల మైలురాయిని అందుకున్నారు అమీర్‌ఖాన్. త్రీ ఇడియట్స్ చిత్రంతో 200కోట్ల మైలురాయిని అధిగమించారు. తాజాగా పీకే చిత్రం ద్వారా 300కోట్ల కలెక్షన్స్ సాధించారు. మతపరమైన విశ్వాసాల్ని ప్రశ్నించేలా పీకే చిత్రంలో కొన్ని అంశాలున్నాయని వివాదాలు చెలరేగుతున్నా.. ఇవేమీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపకపోవడం విశేషమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











