అమీర్ ఖాన్ దర్శకత్వంలో అమితాబ్

అయితే ఈ ప్రాజెక్టుకి అమితాబ్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక గతంలో అమితాబ్ చేసిన బ్లాక్ సినిమా గురించి అమీర్ ఖాన్ కాస్త గట్టిగానే నోరు చేసుకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య సంభంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే అమితాబ్ మాత్రం అదేమీ మనసులో పెట్టుకోక తారా జమీన్ పర్ సినిమాని బహిరంగంగానే పొగిడాడు. ఇప్పటికే అమితాబ్ షారూఖ్,సల్మాన్ ఖాన్ లతో చేసి ఉన్నాడు. అయితే ఈ కొత్త సినిమాలో అమీర్ ఖాన్ నటిస్తాడో లేదో తెలియదు. నటిస్తే మాత్రం ఆ ఇద్దరి కాంబినేషన్ చూడముచ్చటగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











